సౌత్ రౌండప్.. ఎక్కడ ఏం జరుగుతుందంటే..

South Movie Updates:
దసరాకెళ్లింది..?
పాన్ ఇండియా లెవల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్-రామ్ చరణ్-రాజమౌళి.. RRR రిలీజ్‌పై సోషల్ మీడియాలో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ మూవీని అన్ని పరిస్థితులు చక్కబడ్డాక.. మెల్లగా 2021 దసరాకు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
యాక్షన్ మూడ్..
బాలయ్య- బోయపాటి హ్యాట్రిక్ మూవీ షూటింగ్ మొన్నటి వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇక తర్వాతి షెడ్యూల్ కోసం వారణాసి వెళ్తారని రూమర్ వినిపించింది. అయితే మూవీ టీమ్ యాక్షన్ సీన్స్ కోసం నంద్యాలలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
పంచ్‌ల నుండి పౌరాణికం..
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తోన్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. నితీష్ తివారి, రవి ఉద్యావర్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసినట్టు సమాచారం. అలాగే డైలాగ్ వెర్షన్ అంతా కూడా లాక్‌డౌన్ టైంలోనే పూర్తి చేసేశారని, ఆయన రాసిన మాటల ఆధారంగా రైటర్స్ మిగతా భాషల్లో సంభాషణలు రాస్తున్నారట.
ఇట్స్ షూట్ టైమ్..
నయనతార, సమంత కలసి ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగులో తాజాగా సమంత జాయిన్ అయింది.
ప్రొడ్యూసర్ మహేష్…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అడవి శేష్‌తో ‘మేజర్’ మూవీ నిర్మిస్తున్న సూపర్ స్టార్.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఛలో గోవా..
RRR షూట్ నుంచి బ్రేక్ తీసుకున్న ఆలియా.. ముంబయ్ వచ్చి రావడంతోనే.. వెంటనే తన బాయ్ ఫ్రెండ్.. స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి గోవా చెక్కేసింది. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి గోవా వెళ్తున్న ఈ జంట ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సలార్ కోసం..
ప్రభాస్-ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్’ కోసం మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ ఇండియా ఆడియెన్స్‌ను ఆకర్షించే పనిలో భాగంగా అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్‌ను వెతికే పనిలో ఉన్నారు టీమ్.
ప్లాన్ మారిందా..?
మెగా ఫ్యామిలీ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రూమర్ వినిపిస్తోంది. ఫస్ట్ మూవీ కావడంతో సెంటిమెంట్‌గా థియేటర్‌లో కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఫిట్‌నెస్ మంత్రం..
మనసు-శరీరం ఫిట్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే వర్కౌట్స్ ఒక్కటే మార్గం అంటోంది కన్నడ భామ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా. తన బ్యూటీ..ఫిట్‌నెస్ సీక్రెట్ అదే అంటోందీ కూర్గ్ బ్యూటీ.
మ్యూజిక్ మెడిసిన్..
సంగీతం పరమౌషదం అంటోంది స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ముఖ్యంగా మానసిక రోగాలను తక్కువ టైమ్‌లో పోగోట్టాలి అంటే పాటలు వినడం ఒక్కటే మార్గమంటోంది. తాను డీప్ డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు పాటలు మాత్రమే తనకు మెడిసిన్‌లాగా పనిచేశాయంటోంది శృతి.
రౌడీ జవాన్..
సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ఇండియా -పాకిస్థాన్ బోర్డర్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఓ సాహస జవాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇండియా-పాకిస్తాన్ వార్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
స్పెషల్ సాంగ్..
అజయ్ భూపతి డైరెక్షన్‌లో శర్వానంద్-సిధ్థార్థ్ హీరోలుగా నటిస్తున్న ‘మహాసముద్రం’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు.
రౌడీ బేబీ..
వరుస సినిమాలు లైన్ అప్ చేసుకుంటున్నారు యంగ్ హీరోలు. ఇటీవలే ‘A1 ఎక్స్‌ప్రెస్’ సినిమా కంప్లీట్ చేసిన సందీప్ కిషన్.. ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’ తర్వాత జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్.
నషా..
ఈ మధ్య వెబ్‌సిరీస్ ట్రెండ్ బాగా నడుస్తోంది. హన్సిక లీడ్ రోల్ చేయగా.. ‘పిల్ల జమిందార్’, ‘భాగమతి’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన వెబ్ మూవీకి ‘నషా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కాబోతోంది.
జల్లికట్టు..
2021 ఆస్కార్ బరిలో ఉన్నమలయాళ మూవీ ‘జల్లికట్టు’.. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ఎక్స్‌వైజడ్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శించారు. అంతే కాదు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేయనుంది ఈ సంస్థ.
పోస్ట్ ప్రొడక్షన్‌లో..
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’.. (హూ వేర్ వై) అనే కాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి కె.వి.గుహన్ డైరెక్టర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
జిమ్ డ్యాన్స్..
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ క్రియేటివిటీ చూపించింది. సారా నటించిన ‘కూలీ నెం1’ సీక్వెల్ డిసెంబర్ 25 నుండి ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి.
తాజగా ఓల్డ్ కూలీ నెంబర్ వన్ సాంగ్‌కు జిమ్ చేస్తూ.. డ్యాన్స్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది సారా.. ఈ వీడియోకు బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
మధుర జ్ఞాపకం..
‘జెర్సీ’ జర్నీ ఓ మధురమైన జ్ఞాపకం అంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. 47 రోజుల్లో, అది కూడా కోవిడ్ సిచ్యువేషన్స్‌లో సినిమాను కంప్లీట్ చేయడం.. ఆ విచిత్రంలో తాను ఉండటం అద్భుతంగా ఫీల్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశాడు షాహిద్. ఈ జర్నీలో డైరెక్టర్ గౌతమ్‌కు థ్యాంక్స్ చెప్పాడీ బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’..
లండన్ వీధుల్లో..
లండన్ వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ హల్‌చల్ చేస్తోంది. ఫ్యాషన్ ట్రెండీ ఔట్ ఫిట్‌లో వింటర్ ఫ్యాషన్ డ్రెస్‌లో లండన్ వీధుల్లో విహరిస్తోంది సోనమ్. నాటింగ్ హిల్‌లోని తనకు ఇష్టమైన ఫ్లవర్ షాప్‌లో తనకిష్టమైన ఫ్లవర్స్‌ని తీసుకుని మురిసిపోతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది..
అంతకంటే ముందు…
ముందు మణిరత్నం సినిమా కంప్లీట్ అయిన తరువాతే… తన కొత్త సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ‘పొన్నియన్ సెల్వమ్’ మూవీలో తన పోర్షన్ షూట్ కంప్లీట్ అయిన తరువాతే కార్తిక్ సుబ్బరాజ్‌తో తన కొత్త సినిమా మొదలెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేనికైనా రెడీ..
హీరోయిన్ అమలా పాల్ అటు సినిమాలు చేస్తూనే, మరోపక్క వెబ్‌సీరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ సీరీస్‌లో నటించిన ఈ భామ.. రీసెంట్‌గా ‘ఆహా’ కోసం మరో సీరీస్‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. 8 ఎపిసోడ్స్‌గా రూపొందే ఈ సీరీస్‌ని పవన్ అనే కన్నడ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నట్టు సమాచారం.
విశ్వనాథ్‌గా..
భారత్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నట్టు తెలస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సినిమా కోసం…
సినిమా కోసం బాగా కష్టపడుతోంది హీరోయిన్ తాప్సి.. తన ప్రజెంట్ ప్రాజెక్ట్ ‘రష్మీ రాకెట్’ కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేయడంతో పాటు ట్రైనర్ సాయంతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ.. సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.
చెప్పలేనంత ఇష్టం..
అమ్మంటే ఎంతో ఇష్టం అంటోంది టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా. తన తల్లితో ఉన్న ప్రతీ మూమెంట్ తనకు బెస్ట్ అంటోంది. అమ్మతో కలిసి ఉన్న చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రాశీ.
వర్కౌట్ టైమ్..
మిస్ అవ్వకుండా డైలీ వర్కౌట్స్ చేస్తూ.. జీరో సైజ్ మెయింటేన్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. వర్కౌట్ తరువాత ఓ సరదా సెల్ఫీ తీసుకుని.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది జాక్వెలిన్..