Posani Krishna Murali : పోసాని ఇంటిపై రాళ్ళ దాడి.. ఇది వాళ్ళ పనే??

అమీర్ పేట్ సమీపంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై నిన్న రాత్రి 2 గంటల సమయంలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు. అంతే కాక పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

Posani Krishna Murali : పోసాని ఇంటిపై రాళ్ళ దాడి.. ఇది వాళ్ళ పనే??

Posani (1)

Updated On : September 30, 2021 / 12:38 PM IST

Posani Krishna Murali :  ఇటీవల రిపబ్లిక్ ఈవెంట్లో పవన్ చేసిన స్పీచ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. పవన్ స్పీచ్ పై పోసాని మురళి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పోసానిపై వ్యక్తిగతంగా మాటల యుద్ధానికి దిగారు. పోసానిని, అతని కుటుంబాన్ని కించపరుస్తూ అనేక వేల మెసేజ్ లు, కాల్స్ వచ్చాయి. దీంతో అసహనానికి గురయిన పోసాని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని, ఆయన ఫ్యాన్స్‌ని విపరీతంగా దూషించారు.

దీంతో అదే రోజు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడికి దిగారు. కానీ పోలీసుల సహాయంతో ఆయన వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ వల్ల తనకి ప్రాణ భయం ఉందని మీడియాతో పోసాని తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న అర్ధరాత్రి పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు.

Chiranjeevi : రాజమండ్రికి చిరంజీవి.. ఇందుకేనా??

అమీర్ పేట్ సమీపంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై నిన్న రాత్రి 2 గంటల సమయంలో కొందరు దుండగులు రాళ్లు విసిరారు. అంతే కాక పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అయితే పోసాని కుటుంబం గత కొన్ని నెలలుగా వేరే చోట ఉంటున్నారు. ఈ విషయం తెలియని దుండగులు ఈ ఇంటిపై దాడి చేశారు. అయితే అక్కడే నివసించే వాచ్ మెన్ కుటుంబ సభ్యులు ఈ సంఘటనతో భయాందోళనలకు గురయ్యారు. ఇవాళ ఉదయం సంజీవ రెడ్డి నగర్ పోలీసు స్టేషన్ లో వాచ్ మెన్ ఈ విషయం పై ఫిర్యాదు చేశారు.

దీంతో సంఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ సమీపంలోని సిసి ఫుటేజ్ ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్, పోసానిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.