Kerala CM : కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు చేసిన స్వప్నా సురేష్
కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నాసురేష్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు.

VIJAYAN SWAPNA SURESH
Kerala CM : కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నాసురేష్, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో పట్టుబడ్డ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయం చేశారంటూ ఆరోపణలు చేశారు. భారతదేశంలో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్ తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యక్తిని 2017లో కొచ్చిన్ లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని… అతడిని చట్టం నుంచి తప్పించేందుకు సీఎం పినరయి విజయన్ సహకరించారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం …. ఈజిప్టులో పుట్టిన యూఏఈ జాతీయుడు ఘజన్ మొహమ్మద్ అలావి అల్ జెఫ్రీ అల్ హష్మీ అనే వ్యక్తి 2017, జూన్ 30న కేరళ వచ్చాడు. జులై 4న సీఐఎస్ఎఫ్ అతడిని అరెస్ట్ చేసింది. యూఏఈ కాన్సులేట్ అధికారుల నుంచి తనకు కాల్ వచ్చిందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపింది. తాను సీఎం కార్యదర్శి శివశంకర్‌రెడ్డితో మాట్లాడి మొత్తం విషయాన్ని చెప్పానని, ఆయన విజయన్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు.
ఆ తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు విడుదల చేశారని.. మళ్లీ ఈ విషయంలో విచారణ జరుగలేదని స్వప్నా ఆరోపించారు. అనుమానాస్పదంగా ఉన్న విదేశీ వ్యక్తికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న స్వప్నా సురేష్….. ఈ కేసులో ఇటీవల ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం ప్రమేయం ఉందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే.
Also Read : Killed live-in partner: పెళ్లికి ఒప్పుకోలేదని లివింగ్ పార్ట్నర్ గొంతు కోసిన మహిళ