Mexican Bodybuilder : చెమటపట్టకుండా శస్త్రచికిత్స వికటించి… యంగ్ లేడీ బాడి బిల్డర్ మృతి
చెమటను నిరోధించుకునేందుకు నో స్వెట్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు చెమట నిరోధించే శస్త్ర చికిత్స నిర్వహించి చెమటరావటానికి కారణమయ్యే గ్రంధులను పూర్తిగా తొలగించారు.

వికటించిన చెమట నిరోధక శస్త్ర చికిత్స...ప్రాణాలు కోల్పోయిన యువ లేడీ బాడీ బిల్డర్ (1)
Mexican Bodybuilder : డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించి ఇంకా దేనికోసమో చాలా మంది వెంపర్లాడుతుంటారు. జీవితాన్ని కుదురుగా గడపకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి వారు చేసే పనులు ప్రాణాలమీదకు తీసుకువస్తుంటాయి. తాజాగా ఇదేతరహాలో సోషల్ మీడియా స్టార్, మెక్సికన్ యంగ్ లేడీ బాడీ బిల్డింగ్ ఇన్ ప్లుయెన్సర్ చెమట నివారణ గ్రంధులను తొలగించుకునే సర్జరీ చేయించుకుంటూ కన్ను మూశారు. ఈ ఘటన ఆమె అభిమానులందరిలో విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మెక్సికోకు చెందిన ఓడాలిస్ సాంటోస్ మీనా సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 1,40,000 వేల మంది అభిమానులు ఉన్నారు. 23ఏళ్ళ సాంటోస్ మీనా బలమైన శరీర ధారుడ్యాన్ని కలిగిన మహిళా బాడీ బిల్డర్. అనేక పోటీలలో విజేతగా నిలిచింది. 2019లో మిస్ , మిస్టర్ విభాగాల్లో హెర్క్యులస్ టైటిల్ , వెల్ నెస్ ఫిట్ నెస్ జువెనైల్ పోటీల్లో గెలుపొందింది. ఈ క్రమంలో మెక్సికోలోని స్కిన్ పీల్ క్లినిక్ చెమట నిరోధించేందుకు సరికొత్త టెక్నాలజీతో శస్త్ర చికిత్సలు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టుంది. ఇందుకు సాంటోస్ మీనా ను బ్రాండ్ ప్రమోటర్ గా నియమించుకుంది.
ఈక్రమంలోనే సాంటోస్ మీనా తన శరీరంలోని దుర్వాసనకు కారణంగా మారిన చెమటను నిరోధించుకునేందుకు నో స్వెట్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు చెమట నిరోధించే శస్త్ర చికిత్స నిర్వహించి చెమటరావటానికి కారణమయ్యే గ్రంధులను పూర్తిగా తొలగించారు. అయితే ఆమె తీసుకున్న మత్తుమందు వికటించటంతో గుండెపోటుకు గురై సాంటోస్ మీనా మృతి చెందారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సాంటోస్ మీనా మృతిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీనిపై వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అర్హత లేని వైద్యుడు అనస్ధీషియా ఇవ్వవటం వల్లే ఆమె మరణించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అసుపత్రి వర్గాలు సైతం ఈ ఘటనపై స్పందించాయి. సర్జరీ చేయకముందే ఆమె ఆనస్థీషియా ఇచ్చిన వెంటనే ఊపిరి నిలిచిపోయి చనిపోయిందని వారు తమ ప్రకటనలో తెలిపారు. సర్జరీ కారణంగానే ఆమె చనిపోయిందన్న వాదనలో నిజం లేదని ఆసుపత్రి వర్గాలు కొట్టిపారేశాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.