BJP MLA – Tea seller : చాయ్‌వాలాకు రూ.30,000 బాకీపడ్డ బీజేపీ ఎమ్మెల్యే .. నడిరోడ్డుమీదే అడిగితే ఏమన్నారంటే..
ఓ సాధారణ చాయ్‌వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే కరణ్‌సింగ్‌వర్మ.అది కూడా నాలుగేండ్ల కిందట.. ఓ రోజు తనకు రూ.30వేలు బాకీ పడిన ఎమ్మెల్యే కనిపించాడు. ఎమ్మెల్యే కదా..అడిగితే ఏమంటాడోనని భయపడలేదు. ధైర్యంగా తనకు రావాల్సిన రూ.30వేల బాకీ గురించి అడిగాడు. దానికి ఆ ఎమ్మెల్యే షాక్ అయ్యాడు. ఆ తరువాత ఏమన్నాడంటే..

Tea seller stops BJP MLA on road, says ‘pay my Rs 30000’
Tea seller BJP MLA says ‘pay my Rs 30000’ : ఓ సాధారణ చాయ్‌వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డారు బీజేపీ ఎమ్మెల్యే కరణ్‌సింగ్‌వర్మ.అది కూడా నాలుగేండ్ల కిందట.. కాయాకష్టం చేసి సంపాదించుకొనే ఆ చిరువ్యాపారికి అంత మొత్తం అంటే చాలా ఎక్కువే. అతను కనిపిస్తే తనకు రావాల్సిన బాకీ అడుగుదామని అనుకుంటున్నాడు సదరు చాయ్ వాలా. ఎమ్మెల్యే కదా కార్లలోనే తిరుగుతుంటారు. తనకు కనిపించడాయే..మరి ఎలా తన బాకీ గురించి అడిగేది అని అనుకునేవాడు. కానీ ఓ రోజు తనకు రూ.30వేలు బాకీ పడిన ఎమ్మెల్యే కనిపించాడు. ఎమ్మెల్యే కదా..అడిగితే ఏమంటాడోనని భయపడలేదు. ధైర్యంగా తనకు రావాల్సిన రూ.30వేల బాకీ గురించి అడిగాడు.
అనుకోకుండా కనిపించిన ఎమ్మెల్యేను తనకు రావాల్సిన బాకీ గురించి అడిగాడు. మధ్యప్రదేశ్‌లోని ఇచ్చావర్ ఎమ్మెల్యే కరణ్‌సింగ్‌వర్మ ఓ కార్యక్రమం గురించి గ్రామానికి రావటంతో రోడ్డు మీదే నిలదీశాడు. నాలుగేళ్లుగా నా డబ్బులు ఇవ్వలేదని ఇవ్వాలని అడిగాడు. చాయ్‌వాలా ఎమ్మెల్యే కారు ఆపి మరీ తన బాకీ గురించి అడిగాడు.దానికి సదరు ఎమ్మెల్యే అందరి ముందు అడగటంతో షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని రేపు వచ్చి నన్ను కలువు ఇచ్చేస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా ఎమ్మెల్యే కరణ్ సింగ్ వర్మ మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. నికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సెహోర్ జిల్లా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా కావడం గమనార్హం.