తెలంగాణ గవర్నమెంట్‌పై హైకోర్టు సీరియస్

తెలంగాణ గవర్నమెంట్‌పై హైకోర్టు సీరియస్

Updated On : July 1, 2020 / 6:49 PM IST

కరోనా పరీక్షలు నిలిపివేయడాన్ని తెలంగాణ హైకోర్టు ఎండగట్టింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో స్పష్టత లేని సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలనే ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో వివరించాలి. కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు వెల్లడించాలి. 20 రోజులుగా జరిగిన పరీక్షల వివరాలు కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించండి. జులై 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ ఇవి అమలుకాకుంటే జులై 20న సీఎస్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read:తెలంగాణలో మరో నెల రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు