రోజుకు 3 పరీక్షలు.. తెలంగాణలో డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహణకు కసరత్తు

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది.

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 02:44 AM IST
రోజుకు 3 పరీక్షలు.. తెలంగాణలో డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహణకు కసరత్తు

Updated On : October 31, 2020 / 2:22 PM IST

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది.

కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. అన్ని పరీక్షలను వాయిదా వేశారు. అయితే కొత్త విద్యా సంవత్సరం దగ్గర పడుతోంది. దీంతో పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. పరీక్షలు ఎలా నిర్వహించాలి? అనేదానిపై చర్చలు జరుపుతోంది.

భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు:
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ డిగ్రీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన వైస్‌ చైర్మన్లు గురువారం(మే 14,2020) సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉండాలన్న విషయంపై చర్చించారు. 

* ముందుగా ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.
* భౌతిక దూరం పాటించేలా, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రోజుకు మూడు పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన.
* ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంలోగా రెండు గంటలకో పరీక్ష నిర్వహించేలా చర్యలు. 
* ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాక, వెనువెంటనే సెకండియర్, ఫస్టియర్ సంవత్సరాలకు సెమిస్టర్, బ్యాక్‌లాగ్‌ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం.
* దీనిపై సమగ్ర ప్రణాళికతో త్వరలోనే వర్సిటీలకు స్పష్టమైన ఆదేశాలు

డిటెన్షన్‌ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్‌:
కాగా, జూన్‌ 20 నుంచి వర్సిటీలు పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయాన్ని రెండు గంటలకే తగ్గించాలని, డిటెన్షన్‌ రద్దు చేసి విద్యార్థులందరినీ పై సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలని ఇదివరకే విద్యామండలి ఆదేశించింది. అందుకు అనుగుణంగా వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం సమస్యగా మారుతుందని గురుకుల విద్యాలయాల కార్యదర్శి లేఖ రాయగా దానిపైనా చర్చించారు.

తెలంగాణలో 1400 దాటిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం(మే 14,2020) కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 47 కేసులను గుర్తించినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1414కు చేరుకున్నాయి. గురువారం కరోనా నుంచి కోలుకొని 13 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారు 952 మంది అని వెల్లడించారు. కొత్తగా నమోదైన 47 కేసుల్లో 40 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. 

జీహెచ్ఎంసీలో డేంజర్ బెల్స్, సూర్యాపేట జిల్లాలో సున్నాకు చేరిన కేసులు:
గత ఆరు రోజుల కేసుల నమోదును పరిశీలిస్తే.. ఈ నెల 9న 30 కేసులు, 10న 33 కేసులు, 11న 79 కేసులు, 12న 37 కేసులు, 13న 31 కేసులు.. మొత్తంగా ఆరు రోజుల్లోనే ఇక్కడ 250 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఐదు రంగారెడ్డి జిల్లాలో, మరో రెండు వలస వచ్చిన వారిలో నిర్ధరించారు. వీరిరువురిలో ఒకరు నల్గొండకు వచ్చిన వలస వ్యక్తి కాగా, మరొకరు జగిత్యాలకు వచ్చిన వ్యక్తి. దీంతో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస ప్రజల్లో పాజిటివ్ గా గుర్తించిన వారి సంఖ్య 37కు చేరింది. గురువారం మరో 13 మంది కొవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకెళ్లారు. దీంతో సూర్యాపేట జిల్లా నుంచి కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా కోలుకున్నట్లే. జిల్లాలో మొత్తం 83 మందికి వైరస్ సోకగా అందరూ క్రమంగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంది.

Read Here>> విద్యార్థులకు గమనిక : TS EAMCET పరీక్ష డేట్ ఫిక్స్!