భలే ‘మ్యాజిక్ బియ్యం’ : నీళ్లు పోస్తే చాలు..ఉడికించకుండానే అన్నం రెడీ..కరీంనగర్ యువరైతు కృషి

భలే ‘మ్యాజిక్ బియ్యం’ : నీళ్లు పోస్తే చాలు..ఉడికించకుండానే అన్నం రెడీ..కరీంనగర్ యువరైతు కృషి

Updated On : January 9, 2021 / 2:05 PM IST

Telangana : karimnagar farmer magic rice : అమ్మా ఆకలేస్తోందే అని బిడ్డ అంటే ఒక్క పావుగంటరా..ఇప్పుడే వేడి వేడిగా పెడతాను అంటుంది తల్లి. కానీ పిల్లాడు అలా అన్నం అడగ్గానే..అస్సలు బియ్యాన్ని ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతే..ఇలా క్షణాల్లో బిడ్డకు అన్నం పెట్టేస్తే..భలే ఉంటుంది కదా..కానీ అది సాధ్యమేనా? అంటే ఎందుక్కాదు అంటూ ఉడికించకుండానే నీళ్లు పోస్తే చాలా అన్నం రెడీ అయిపోయే ధాన్యాన్ని పండిచారు తెలంగాణాలోని కరీనగర్ కు చెందిన ఓ రైతు.

ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోయే ఆ రైస్ పేరు ‘మ్యాజిక్ రైస్’. మ్యాజిక్ రైస్ పేరుకు తగ్గట్టుగానే మ్యాజిక్‌లా ఉంటుంది. ఈ బియ్యాన్ని ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతుంది.కేవలం 10నిముషాలపాటు ఆ బియ్యంలో నీళ్లలో పోసి నానబెడితే చాలు అన్నం రెడీ అయిపోతుంది. గ్యాస్ ఖర్చులేకుండా..కరెంట్ ఖర్చు కూడా లేకుండా..కట్టెలపొయ్యి మీద పాట్లు పడకుండా చక్కగా అన్నం రెడీ అయిపోతుందంటున్నాడు కరీంనగర్ జిల్లా ఇల్లంత కుంటకు చెందిన శ్రీకాంత్ అనే రైతు. కృతి వ్యవసాయంపై మమకారం పెంచుకున్న ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లెకు చెందిన రైతు శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైసును సాగు చేస్తున్నారు.

ఈ మ్యాజిక్ రైసు పండించే రైతు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ మ్యాజిక్ రైసులో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందనీ..దీంతో కొంచెం ఆసల్యంగా అరుగుతుందని ..కానీ కావలిసిన శక్తి ఈ అన్నంలో ఉంటుందని శ్రీకాంత్ తెలిపాడు. శ్రీకాంత్ కు చిన్నప్పటినుంచి వ్యవసాయం కుటుంబం. దీంతో స్వతహాగానే శ్రీకాంత్ వ్యవసాయంపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. కొత్తగా ఏదో చేయాలనుకున్న శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైస్ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఈ పంట కోసం తెలుసుకోవటానికి 9 రాష్టాలలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. 120రకాల దేశీయ వరి వంగడాలను తీసుకొచ్చాడు. పూర్తిగా సేంద్రియ ఎరువుల వ్యవసాయం చేస్తున్నాడు శ్రీకాంత్.

మార్పులు అంటే సమస్యలు..ఆటుపోట్లు ఎదురవ్వటం సర్వసాధారణమే. అలాగే ఈ మ్యాజిక్ రైతు పంట పండించాలనే ఆలోచన వచ్చి సాగు చేసే క్రమంలో శ్రీకాంత్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురుకున్నారు. కానీ ఎట్టకేలకు తన మ్యాజిక్ రైస్ పంటను వేయాలనే నిర్ణయించుకున్నారు శ్రీకాంత్. ఈ కొత్తరకం రైస్‌ను పండించడానికి సుభాష్ పాలేకర్ రేడియాప్రసంగం విని పకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపారు.

తాజాగా అస్సాం నుండి శ్రీకాంత్ తీసుకొచ్చిన బోకాసాల్ అనే రకం బియ్యం అందరిని ఆకర్షిస్తోంది. పంటసాగు సమయం జూన్ నుండి డిసెంబర్ కాగా 145రోజుల్లో పంట చేతికొస్తుంది. బోకాసాల్ బియ్యాన్ని కేవలం నీళ్లలో నాన బెడితే చాలు అన్నం రెడీ అవుతుంది అని చల్లటి నీళ్లలో వేస్తె చల్లటి అన్నం, వేడి నీళ్లలో వేస్తె వేడి అన్నం రెడీ అవుతుందని రైతు శ్రీకాంత్ అంటున్నాడు. భలే ఉంది కదూ ఈ మ్యాజిక్ బియ్యం విషయాలు. ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోవటం..!!

ఈ బియ్యంలో 10.73 శాతం ఫైబర్, 6.8శాంతం ప్రోటీన్స్ ఉంటాయని గౌహతి యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఒక కొత్త రకం రైస్ తీసుకరావడం తనకు అలవాటని అందులోనే భాగంగా ఈఏడాది అస్సాం నుంచి ఈ మ్యాజిక్ రైస్ ను తీసుకొచ్చానని రైతు శ్రీకాంత్ తెలిపారు.

అంతరించిపోతున్న దేశీయ వంగడాలలో ఇదో రకం అని అస్సాం లో ఇది ఎక్కువ దొరుకుతుందని..ఆర్మీ వాళ్ళు ఈ బియ్యాన్ని ఎక్కువ తింటుంటారని తెలిపారు. ఈ రైస్ కూర లేకుండా కూడా తినేయవచ్చని అంటున్నాడీ యువరైతు.