తెరుచుకున్న స్కూళ్లు..‘కరోనా ఫీజు’ అంటూ అదనపు వసూళ్లు..

Telangana private schools charges extra corona fee : దాదాపు 11 నెలల తరువాత తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9th, 10th క్లాసుల విద్యార్థులకు క్లాసు రూముల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఏంటా కొత్తరకం ఫీజులు అంటారా? దాని పేరు ‘కరోనా ఫీజు’.
ఇలా స్కూళ్లు తెరుచుకున్నాయో లేదో అలా ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టేశారు. ఇప్పటి వరకూ స్కూళ్లు మూతపడి ఉండటంతో స్కూలును పరిసరాలను శుభ్రం చేయటానికి ఈ కొత్తరకం ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఇన్నాళ్లు మేం చాలా నష్టపోయాం…ఈ ఖర్చులు కూడా ఎక్కడ భరించాలి? అంటున్నారు.
స్కూలుకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాలను..ఆ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం శుభ్రంగా చేయటనాకి ఈ కొత్తరం ‘కరోనా ఫీజులు’ వసూలు చేస్తున్నారు. అంటే పరిసరాల్లో శానిటైజర్ స్ప్రే చేసేందుకు..వాటికి అయ్యే ఖర్చు కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు.
ఈ కొత్తరకం కరోనా ఫీజును ఒక్కోచోట ఒక్కోలా వసూలు చేస్తున్నారు. కొందరు నెలకు ఒక్కో విద్యార్థి వద్ద రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఆ ఫీజులు ఇంకా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించేందుకు మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా, విద్యార్థుల నుంచే ఆ ఫీజును వసూలు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఈ కరోనా ఫీజుల వసూళ్లు చూస్తుంటే..తరత్రా పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నాయి యాజమాన్యాలు.
కాగా..కరోనా తగ్గుముకం పట్టాక..స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. క్లాసుల్లో 50 శాతం విద్యార్థులు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ లెటర్స్ కూడా తీసుకోవాలని సూచించింది.
ప్రతీ స్కూల్లోను తప్పనిసరిగా హ్యాండ్ వాష్, శానిటైజర్లు, సోపులు, విద్యార్ధుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మామీటర్లను అందుబాటులో ఉంచాలి. అలాగే ముఖ్యంగా విద్యార్థుల మధ్య సామాజిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరి చేసింది. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, క్లాస్ రూంలను ప్రతీ రోజు శానిటైజ్ చేయించాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.