Statue of Equality: సమతామూర్తి పోస్టల్ కవర్ ఆవిష్కరించిన చిన్నజీయర్ స్వామి, మై హోమ్ రామేశ్వర రావు
ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహంతో పోస్టల్ కవర్ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు.

Statue Of Equality
Statue of Equality: రంగారెడ్డి ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ఆవిషృతమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో సమతామూర్తి విగ్రహంతో తపాలాశాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ అత్యద్భుత శుభ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also read : Statute Of Equality : అంకురార్పణతో ప్రారంభంకానున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
సమతామూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శన ఎంతగానో అలరించింది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో యాగశాలలో వాస్తు శాంతి పూజ బుధవారం మధ్యాహ్నం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది.
Also read : Ode To Equality : ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం..అన్ని దారులు అటువైపే