Lose Weight : కొవ్వును కరిగించి….బరువును తగ్గించుకునేందుకు…
రోజువారి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. భారీ వర్కవుట్ల కంటే తేలిక పాటి వ్యాయామాలు మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. కొవ్వులు కరిగేందుకు దోహదం చేస్తాయి.

Man's Hand Holding Excessive Belly Fat, Overweight Concept.
Lose Weight : బరువు పెరగడం సులువే అయినప్పటికీ తగ్గించుకోవాలంటే మాత్రం కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మెరుగైన జీవనశైలిని అలవరుచుకోవాలి. బరువు తగ్గటంపై దృష్టి పెట్టటంతోపాటు, శారీరక శ్రమ చేయాలి. తక్కువ కెలొరీలుండే కూరగాయలను రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లతో కూడిన పోషకాహారాన్ని ఎంచుకోగలిగితే, కొవ్వును సులభంగా కరిగించవచ్చు.
నూనెలో వేయించినవి, మసాలాలను తగ్గించి తాజాపండ్లను తినాలి. మాంసకృత్తులను కూడా తీసుకోవాలి. అయితే అధిక మొత్తంలో కాకుండా శరీరానికి ఎంత అవసరమో అంతమోతాదులో మాత్రమే మాంసం, పాలు, పప్పుదినుసులు వంటివి తీసుకోవాలి. చిరుతుళ్ళను, ప్యాక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ను మానుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల శరీరంలో కొవ్వులు పెరగకుండా చూసుకోవచ్చు.
అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా ఉండాలంటే దాహం వేసే లోపే నీళ్లు తాగుతూ ఉండాలి. శరీరంలోని వ్యర్ధపదార్ధాలు బయటకు వెళ్ళాలంటే నీరు తాగటం చాలా అవసరం. శరీరంలోకి వెళ్ళిన పోషకాలు శరీరం మొత్తం సద్వినియోగం చేసుకోవాలంటే నీరు తగినంత మోతాదులో తీసుకోవాలి. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం ద్వారా రక్తంలో చక్కెర స్ధాయిలు సమతుల్యం అవుతాయి. దీంతో కొవ్వులు సులభంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా ప్రొటీన్ ఆహారం కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది. బరువును నియంత్రించవచ్చు.
రోజువారి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. భారీ వర్కవుట్ల కంటే తేలిక పాటి వ్యాయామాలు మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. కొవ్వులు కరిగేందుకు దోహదం చేస్తాయి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ , సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఎంచుకోవాలి. ఫిట్ నెస్ వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. జీరో కెలొరీలుండే శీతలపానీయాలను తీసుకోవాలి. తాజా పండ్ల రసాలను తాగటం మంచిది. శరీర బరువును తగ్గించటంలో కార్టిసాల్ హార్మోన్ సక్రమ పనితీరు చాలా అవసరం. కంటి నిద్ర వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. కాబట్టి నిద్రలేమి అంతమంచిది కాదు.