హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూత

  • Published By: sekhar ,Published On : December 2, 2020 / 04:59 PM IST
హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూత

Updated On : December 2, 2020 / 5:04 PM IST

Yada Krishna passes away: టాలీవుడ్ హీరో, నిర్మాత యాదా కృష్ణ బుధవారం గుండెపోటులో మృతి చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు.. యాదా కృష్ణ 20పై పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ లాంటి బి గ్రేడ్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు యాదా కృష్ణ.


ఆ తర్వాత ‘సంక్రాంతి అల్లుడు’ అనే ఫ్యామిలీ సినిమాలోనూ నటించారు. నిర్మాతగానూ కొన్నిచిత్రాలు నిర్మించారు. కాగా కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారాయన. యాదా కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.