Bridge collapses in US : యూఎస్‌లో బ్రిడ్జి కూలి నదిలో పడిన గూడ్స్ రైలు
: అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి....

Bridge collapses in US
Bridge collapses in US : అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి. గూడ్స్ రైలు మోంటానాలోని ఎల్లోస్టోన్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
నది నీటిలో ప్రమాదకర సల్ఫర్, వేడి తారు పడటంతో ఎగువ ప్రాంతానికి నది నుంచి మంచినీరు తీసుకోవడాన్ని నిలిపివేశారు.(Train carrying hot asphalt, molten sulfur plunges into river) రైలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని మోంటానా రైల్ లింక్ ప్రతినిధి ఆండీ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.
PM Modi in Egypt : భారత్‌తో వాణిజ్య సంబంధాలపై ఈజిప్టు ప్రధాని,మంత్రులతో మోదీ చర్చలు
వంతెన కూలిపోవడంతో రాష్ట్రంలోని పలువురు వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందించే ఫైబర్-ఆప్టిక్ కేబుల్ కూడా తీసినట్లు హై-స్పీడ్ ప్రొవైడర్ గ్లోబల్ నెట్ తెలిపింది.యూఎస్ లో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదనీరు నదిలో పొంగిప్రవహిస్తోంది. నదిపై ఉన్న రైలు వంతెన కూలిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కలుషితమైన నది నీరు పొలాలకు వెళ్లకుండా కాల్వ వద్ద నిలిపివేశారు.