Miss Universe 2021 : మిస్ యూనివర్స్ హర్నాజ్ గౌన్‌ను డిజైన్ చేసిన ట్రాన్స్‌జెండర్ ‘నైషా’నైపుణ్యం గురించి తెలుసా?
మిస్ యూనివర్స్ హర్నాజ్ గౌన్‌ను డిజైన్ చేసిన ట్రాన్స్‌జెండర్ ‘నైషా’ నైపుణ్యం గురించి తెలుసా? అవమానాలను ఎదుర్కొని బాలివుడ్ సెలబ్రిటీల దుస్తులు డిజైనర్ ట్రాన్స్ జెండర్ గా మారిన వైనం.

Miss Universe 2021
Miss Universe 2021 రెండు దశాబ్దాల తరువాత భారత్ ఎదురు చూపులు ఫలించాయి. 21 ఏళ్ల తరువాత విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది 21 ఏళ్ళ యువతీ హర్నాజ్ కౌర్. విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ వేసుకున్న గౌన్ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సిల్వర్ కలర్ లో ధగధగా మెరిసిపోయిన హర్నాజ్ కౌర్ ధరించిన గౌన్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాలివుడ్ హేమాహేమీ దుస్తుల డిజైనర్ అయినా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ ‘సైషా షిండే అలియాస్ స్వప్నిల్ షిండే ’..!! సర్జరీ చేయించుకుని ట్రాన్స్‌వుమెన్‌గా మారిన నైషా షిండే అలియాస్ స్వప్నిల్ షిండే..
‘నేను గే కాదు.. ట్రాన్స్ వుమన్ ని’ అని ప్రకటించిన ధీర బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నైషా షిండే. అబ్బాయిగా ఉన్న తాను సర్జరీ చేయించుకుని మహిళగా మారానని నైషా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలా ట్రాన్స్ ఉమెన్ గా మారిన స్వప్నిల్ షిండే నైషాగా మారారు. ఆమె డిజైన్ చేసిందే విశ్వసుందరి పోటీల్లో హర్నాజ్ వేసుకున్న గౌన్. మిస్ యూనివర్స్ పోటీ ఫైనల్లో హర్నాజ్ కైర్.. సిల్వర్ గౌన్‌లో ధగధగ మెరిసిపోయింది. ఆ మెరుపుల వెనుక..ఆ అందాల గౌను వెనుక ‘నైషా నైపుణ్యం’ ఉంది.
Read more : ‘నేను గే కాదు.. ట్రాన్స్ వుమన్ ని’: బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే
బీడింగ్‌లు ఉన్న ఆ గౌన్‌లో విశ్వసుందరిగా హర్నాజ్ వేదికపై వెలిగిపోయింది. ఆ చముక్కుల వెనుక నైషా చేతి నైపుణ్యం కూడా మెరిసిపోయింది. విశ్వసుందరిగా కిరీటాన్ని దక్కించుకోవటంతో ఆ గౌను డిజైన్ చేసిన ట్రాన్స్‌వుమెన్ సైషా షిండే ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. ఆనందంలో తేలిపోయింది. హర్నాజ్ సందు ఫోటోను నైషా షిండే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పదుకొనె, కరీనా కపూర్, శ్రద్ధ కపూర్, సన్నీ లియోన్, మాధురీ దీక్షిత్, ప్రియాంక చోప్రా, భూమి ఫడ్నేకర్, హీనా ఖాన్ లాంటి అగ్రనటులకు స్వప్నిల్ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన సైషా సిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. 2021 జనవరిలో నుంచి ఈమె ట్రాన్స్‌వుమెన్‌గా మారింది. స్వప్నిల్ సిండే ‘గే’అంటూ పలు వార్తల్లో సంచలనంగా మారింది. ఈక్రమంలో ఆమె తాను గేను కాదని ట్రాన్స్ ఉమెన్ ను అంటూ ప్రకటించింది. 20 ఏళ్ల వయస్సులో తనలో వచ్చిన మార్పుల్ని గుర్తంచిన నైషా..ఎంతో మానసిక సంఘర్షణకు లోనైంది. ఈ క్రమంలో ఎన్నో అవమానాల్ని ఎదుక్కొంది. గే అంటూ ఎంతోమంది అవహేళన చేశారు. అతని (ఆమె)లో ఉన్న గొప్ప ప్రతిభను కూడా మర్చిపోయి అవమానించారు.
Read more : Miss Universe 2021 : విశ్వసుందరిగా హర్నాజ్ కౌర్ సంధు
సర్జరీ చేయించుకున్న నైషా తన మనోవేదనను పంచుకుంటూ.. ‘‘మనం ఎక్కడ ఉన్నామన్న స్థాయితోను..పరిస్థితులతోను మన గతానికి ఏమాత్రం సంబంధం ఉండదు. వాటితో సంబంధం లేకుండా మన బాల్యం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకువస్తూనే ఉంటాయి. మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నా గతం నేను ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గుర్తుచేస్తుంటుంది. ఏకాంతంలో గడిపేలా నాపై ఒత్తిడి తెచ్చిన ఆనాటి పరిస్థితులు గుర్తుకువస్తాయి. స్కూళ్లో, కాలేజీలో అబ్బాయిలంతా నన్ను కాస్త తేడాగా చూసేవారు. గేలి చేసేవారు.వాటన్నింటిని అధిగమనించా..ప్రముఖుల దుస్తుల ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగా..అయినా నన్ను అవమానాలు వదల్లేదు.
అప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులు నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసేవి. నేను జీవిస్తున్న జీవితం నాది కాదు అనే భావన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. ఈ సంకట పరిస్థితుల్లోకొట్టుమిట్టాడేవాడ్ని. సమాజంలో ఉన్న హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజూ ప్రతిక్షణం మానసిక ఆందోళనకు గురయ్యాను.20 ఏళ్ల వయస్సులో నిఫ్ట్‌లో చేరిన సమయంలో నా గురించి నాకు తెలిసిన నిజాన్ని నేను అంగీకరించాను.
Read more : Miss Universe 2021 : విశ్వసుందరి హర్నాజ్ కౌర్ సంధు..ఈమె ఎవరు ?
అప్పుడే నేను మానసికంగా వికసించాను. అబ్బాయిల వైపు ఆకర్షితుడిని అవుతున్న కారణంగా గే అనుకున్నాను. గుర్తించాను. కానీ ఆరేళ్ల క్రితమే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు ‘‘నేను గే మాన్ కాదు.. ట్రాన్స్ వుమెన్‌ను’’.. నా పేరు సైషా.. అంటే అర్థవంతమైన జీవితం అని అర్థం’’ అని అప్పట్లో నైషా సుదీర్ఘ పోస్టు ద్వారా తన మనోభావాలు వెల్లడించారు బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే… కాదు కాదు ‘‘సైషా షిండే’’.
Read more : Miss Universe : మిస్ యూనివర్స్ గెలవగానే నాకే కాల్ చేసింది : ఉపాసన
కాగా..ప్రస్తుతం హర్నాజ్ కౌర్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న సందర్భంగా ఆమె ధరించిన గౌన్ ను డిజైన్ చేసిన నైషా ఆనందం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా నైషా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఇండియా నుంచి చాలా అంచనాలు ఉంటాయని, చాలా ఆకర్షణీయంగా మోడల్ కనిపించే రీతిలో దుస్తుల్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది’’అని తెలిపింది. మిస్ యూనివర్స్ వయసు 21 ఏళ్లు కాగా, డిజైనర్ సైషా షిండే వయసు 40 ఏళ్లు. ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్లతో గౌన్‌ను డిజైన్ చేసినట్లు సైషా తెలిపింది. పంజాబీ ఆనవాళ్లు కనిపించే రీతిలో పుల్కారీ ప్యాటర్న్‌తో గౌన్‌ను డిజైన్ చేసానని నైషా సిడే తెలిపింది.
Miss Universe Andrea meza : లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ధీరకు ‘విశ్వసుందరి’ కిరీటం