Tamilisai Soundararajan : గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేయించుకోనున్న గవర్నర్
రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు.

Ts Governor Tamilsai Soundarrajan
Tamilisai Soundararajan : రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు. గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడం.. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు.
గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గతం లోనే పిలుపునిచ్చిన గవర్నర్ తమిళిసై టీకా ఫస్ట్ డోస్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న ఆదివాసి గిరిజనులందరికీ కూడా ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్ సూచించారు.