Alipiri Walk Way : అలిపిరి నడక మార్గంలో భక్తులకు అనుమతి

గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది.

Alipiri Walk Way : అలిపిరి నడక మార్గంలో భక్తులకు అనుమతి

Restored Alipiri WalkWay

Updated On : November 23, 2021 / 12:59 PM IST

Alipiri Walkway : గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది. భారీ వర్షాల కారణంగా ఈనెల 17 నుండి తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు మూసివేశారు.

తిరుమలలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గం పలుచోట్ల ధ్వంసమయ్యింది. అలిపిరి మెట్ల మార్గం స్వల్పంగా ఒకటి, రెండు చోట్ల మాత్రం దెబ్బతిన్నది.

Also Read : Delhi Air Pollution : ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

టీటీడీ అధికారులు అలిపిరి మెట్ల మార్గం లో మరమ్మతులు పూర్తి చేసి నేటి నుండి నడక మార్గాన్ని పునరుద్ధరించారు. తిరుమల  రెండు  ఘాట్ రోడ్లలో  సైతం నేటి నుండి ద్విచక్ర వాహనాల రాకపోకలకు టీటీడీ అధికారులు అనుమతించారు.  ఘాట్ రోడ్డులో వెళ్లే ద్విచక్రవాహనదారులు  శ్రీవారి దర్శనం టికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని టీటీడీ సూచించింది.