Taiwan: మ‌రోసారి చైనాకు అస‌హ‌నం తెప్పించే ప‌నిచేసిన అమెరికా

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం చలాయించాల‌ని, తైవాన్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న చైనాకు అమెరికా మ‌రోసారి షాక్ ఇచ్చింది. తైవాన్‌కు 862 కోట్ల రూపాయ‌ల విలువైన‌ మిలట‌రీ-సాంకేతిక సాయాన్ని అందించ‌డానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోద‌ముద్ర వేసింది.

Taiwan: మ‌రోసారి చైనాకు అస‌హ‌నం తెప్పించే ప‌నిచేసిన అమెరికా

China 11zon

Updated On : July 18, 2022 / 10:29 AM IST

Taiwan: ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం చలాయించాల‌ని, తైవాన్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న చైనాకు అమెరికా మ‌రోసారి షాక్ ఇచ్చింది. తైవాన్‌కు 862 కోట్ల రూపాయ‌ల విలువైన‌ మిలట‌రీ-సాంకేతిక సాయాన్ని అందించ‌డానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోద‌ముద్ర వేసింది. ఈ ఏడాది తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్ర‌యిస్తుండ‌డం ఇది నాలుగ‌వసారి. అలాగే, బైడెన్ పాల‌న‌లో తైవాన్‌కు సాయం అందించ‌డం ఇది ఐదవసారి. జూలై 9న అమెరికా-తైవాన్ మ‌ధ్య ధ్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిగాయి.

England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

అలాగే, ఇటీవలే ద‌క్షిణ‌ చైనా స‌ముద్రంలోని నాన్షా దీవులకు స‌మీపంలోకి అమెరికాకు చెందిన బెన్‌ఫోల్డ్‌ యుద్ధనౌక వెళ్ళింది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోన్న చైనాకు అమెరికా చ‌ర్య ఆగ్ర‌హం తెప్పించింది. తైవాన్‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి కొన్ని రోజులుగా చైనా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల పెద్ద ఎత్తున యుద్ధ విమానాల‌ను తైవాన్ గ‌గ‌న‌త‌లానికి స‌మ‌పంలోకి చైనా పంపింది. ఈ నేప‌థ్యంలో తైవాన్‌కు అమెరికా వ‌రుస‌గా భారీగా ఆయుధాల‌ను అందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అమెరికా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్దంటూ చైనా హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది.