Ghani: గని రిజల్ట్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్!

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ ఇటీవల మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి స్పోర్ట్స్ డ్రామా.....

Ghani: గని రిజల్ట్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్!

Varun Tej Emotional Note On Ghani Result

Updated On : April 12, 2022 / 4:36 PM IST

Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘గని’ ఇటీవల మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి స్పోర్ట్స్ డ్రామా మూవీగా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే రిలీజ్ రోజున ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్‌పై గట్టిగానే పడింది. అంతేగాక రెండో శనివారం, శ్రీరామనవమి సెలవులు కూడా ఈ సినిమాపై బాగా ప్రభావం చూపాయి. లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసొస్తుందని అందరూ అనుకున్నారు.

Ghani: గని మూడు రోజుల కలెక్షన్లు.. ఎంతంటే..?

కానీ అలా జరగలేదు.. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా వెళ్తోంది. రేపు, ఎల్లుండి బీస్ట్, కేజీఎఫ్2 ఇలా రెండు భారీ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో గని సినిమా థియేటర్ల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుంది. దీని కారణంగా ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పడిపోనున్నాయి. తొలి మూడు రోజుల్లో కేవలం రూ.4 కోట్ల మేర ఈ సినిమా వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లను కలెక్ట్ చేస్తుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మాత్రం ఏకంగా రూ.25 కోట్లకు జరగడంతో బయ్యర్లు నష్టాలను చూడటం ఖాయమని చిత్ర విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ సినిమా రిజల్ట్‌పై తాజాగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. ఆయన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా, ఈ సినిమా రిజల్ట్ కారణంగా ఆయన ఒక ఎమోషనల్ నోట్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

Ghani: వరుణ్ తేజ్ గని OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

గని సినిమా కోసం ఇన్నాళ్లుగా ప్రేక్షకులు చూపిన ఆదరణ, ప్రేమకు రుణపడి ఉంటానని.. గని సినిమాను పూర్తి చేయడంలో శ్రమించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని.. ముఖ్యంగా నిర్మాతలకు తాను రుణపడి ఉంటానని.. ఓ మంచి సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడి ఈ సినిమాను తీశామని.. అయితే తాము అనుకున్న మేర ఈ సినిమా రిజల్ట్ రాలేదని.. తాను ఎప్పుడు సినిమా తీసినా, ప్రేక్షకులను అలరించేందుకే తీస్తానని.. కొన్నిసార్లు గెలుస్తానని, మరికొన్ని సార్లు నేర్చుకుంటానని.. కానీ ఎప్పటికీ కష్టడటం మాత్రం ఆపనని.. వరుణ్ పేర్కొన్నాడు.

ఇలా గని సినిమా ఫెయిల్యూర్‌గా మిగలడంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశకు గురయ్యిందని ఈ నోట్‌తో స్పష్టం అవుతుంది. వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటించిన గని చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.