Varun Tej: ట్రైలర్‌ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన గని

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్....

Varun Tej: ట్రైలర్‌ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన గని

ghani

Updated On : March 15, 2022 / 12:18 PM IST

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న గని, ఇప్పుడు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గని చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Varun Tej: గని కూడా రెడీ అవుతున్నాడుగా!

ఇక ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్, తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. గని చిత్ర అఫీషియల్ ట్రైలర్‌ను మార్చి 17న ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశాడు. గని చిత్ర ట్రైలర్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. గని సినిమాలో బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని, మునుపెన్నడూ చూడని వరుణ్ తేజ్‌ను ఈ సినిమాలో చూస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే

ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాను అల్లు బాబీ కంపనీ, రినైస్సన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి గని ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే మార్చి 17 వరకు వెయిట్ చేయాల్సిందే.