Salted Green Matar : సాల్టెడ్ పచ్చి బఠానీలు తయారీ చూస్తే తినడానికి ఆలోచిస్తారు

సాల్టెడ్ పచ్చి బఠానీలు స్నాక్స్‌గా తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంటర్నెట్‌లో దాని తయారీ విధానం చూసిన జనం షాకవుతున్నారు.

Salted Green Matar : సాల్టెడ్ పచ్చి బఠానీలు తయారీ చూస్తే తినడానికి ఆలోచిస్తారు

Salted Green Matar

Updated On : June 16, 2023 / 4:04 PM IST

Salted Green Matar : చిరుతిళ్లు తినడానికి అందరూ ఇష్టపడతారు. అయితే వాటి తయారీ విధానం చూస్తే మాత్రం అవాక్కయిపోతాం. కొనడానికి భయపడతాం. సాల్టెడ్ గ్రీన్ మ్యాటర్.. సాల్టెడ్ పచ్చి బఠానీలు ఎలా తయారు చేస్తారో చూస్తే షాకవుతారు. దీని తయారీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Dried Mango Slices : మామిడి ఒరుగుల తయారీ.. 3 నెలల్లో 12 కోట్ల టర్నోవర్

ఏదైనా పనిలో బిజీగా ఉన్నా.. సాయంత్రం సమయాల్లో లేదా ఫ్రెండ్స్ తో ఏదైనా జర్నీలో ఉన్నా ఇష్టమైన స్నాక్స్ వెంట పట్టుకెళ్తాం. తింటూ ఉంటాం. స్నాక్స్ లో చాలామందికి సాల్టెడ్ పచ్చి బఠానీలు ఇష్టం ఉండే ఉంటుంది. అయితే ఇకపై వాటిని తినాలంటే ఆలోచించేలా ఉంది దాని తయారీ విధానం. దాని తయారీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. _heresmyfood అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

 

వేయించిన బఠానీలను కృత్రిమ రంగులో ముంచారు. తయారు చేసే ప్రదేశం అపరిశుభ్రంగా ఉంది. తయారు చేసే కార్మికుడి చేతికి తొడుగులు లేవు. క్లిప్ లో దాదాపుగా 120 కిలోల సాల్టెడ్ పచ్చి బఠానీలను తయారు చేసారు. ఓ కంటైనర్ నుండి నానబెట్టిన బఠానీలను ఒక వ్యక్తి బయటకు తీస్తాడు. వాటిపై కృత్రిమ రంగును చిలకరించడం మరియు తన చేతులను ఉపయోగించి అన్నింటినీ కలిడం కనిపిస్తుంది. ఒక బకెట్ లో వాటిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. నేల మీద ఉంచిన ప్లాస్టిక్ షీట్ పై బఠానీలను పోస్తాడు. ఇక వీడియో చూస్తే మరింత వివరంగా కనిపిస్తుంది.

Wood Pressing Oil : కల్తీలేని కట్టెగానుగ నూనె తయారీ

ఈ వీడియో చూస్తూ మాత్రం కొన్ని రకాల ఆహారపదార్ధాలు తయారీ వెనుక ఇంత అపరిశుభ్రత ఉంటుందా? అని ఆశ్చర్యం కలగకమానదు. ఇలాంటి పరిసరాలు.. పరిశుభ్రత పాటించని వ్యక్తులతో తయారైన ఫుడ్ తింటే అనారోగ్యాలు ఖాయమని వీడియో చూసిన వారు వాపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by SALONI BOTHRA (@_heresmyfood)