Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. తన్నుకున్న ఇద్దరు వ్యక్తులు.. స్పందించిన మెట్రో అధికారులు
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.

Delhi Metro
Delhi Metro : పాటలు, రీల్స్, తన్నుకోవడాలు, లవ్ స్టోరీలు, ముద్దుల వీడియోలు వీటన్నికి ప్రత్యేక అడ్డా ఢిల్లీ మెట్రో. తాజాగా ఇద్దరు వ్యక్తులు కోచ్‌ను రణరంగంగా మార్చిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రోలో అగ్లీ ఫైట్ జరిగింది. ఈ కొత్త వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా రకరకాల కారణాలతో వార్తల్లో ఉన్న ఢిల్లీ మెట్రో మరోసారి అందరి దృష్టిలో పడింది. @sbgreen17 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. చాలామంది ప్రయాణికులతో రద్దీగా ఉన్న మెట్రోలో ఇద్దరు పురుషులు ఒకరినొకరు కొట్టుకోవడం.. దూరంగా నెట్టుకోవడం కనిపించింది. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వీడియోపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఓ ప్రకటన విడుదల చేసింది.
‘మెట్రోలో ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అభ్యర్థిస్తున్నాము.. ఇతర ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లైతే వెంటనే DMRC హెల్ప్ లైన్‌లో విషయాన్ని తెలియజేయాలి.. DMRC ప్లయింగ్ స్క్వాడ్‌లను కూడా నియమించింది. మెట్రోలో ప్రవర్తన సరిగా లేని వారిపై చట్ట నిబంధనల ప్రకారం అవసరమైతే చర్యలు తీసుకోవడానికి మెట్రో మరియు సెక్యూరిటీ సిబ్బంది కలిగి ఉన్నామంటూ’ DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ‘జీవితంలో ఉన్న సమస్యలు సరిపోవా?.. మెట్రోలో కూడా ప్రశాంతంగా ఉండలేరా?’ అంటూ ఒకరు..’అన్ని వయసుల వారికి ఆనందం DMRC’ లో అందుబాటులో ఉందని మరొకరు స్పందించారు.
A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn
— Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023