Vijay Devarakonda: సమంతను టీజ్ చేస్తున్న విజయ్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా....

Vijay Devarakonda: సమంతను టీజ్ చేస్తున్న విజయ్.. మామూలుగా లేదుగా!

Vijay Devarakonda Teases Samantha

Updated On : April 22, 2022 / 8:51 AM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విజయ్ దేవరకొండ, ఇటీవల తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశాడు. మరోసారి పూరీ జగన్నాధ్‌తో కలిసి ‘జనగణమన’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. పూర్తి దేశభక్తి సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-సమంత మూవీ లాంఛ్

అయితే ఈ సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాను స్టార్ట్ చేశాడు ఈ సెన్సేషనల్ హీరో. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తాజాగా ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ముహూర్తం వేడుకను నిన్న ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమా ముహూర్తంకు దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ముహూర్తం వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు అందరరూ పాల్గొన్నారు. కానీ నటీనటుల విషయానికి వస్తే ఒక్క హీరో విజయ్ దేవరకొండ మాత్రమే మనకు కనిపించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

VD-Samantha: విజయ్ దేవరకొండ, సమంత సినిమా షురూ!

కానీ ఆమె ఈ సినిమా ముహూర్తానికి రాలేకపోయింది. ఆమెతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న రాహుల్ రామకృష్ణ, కమెడియన్ వెన్నెల కిషోర్‌లు కూడా ఈ వేడుకలో మిస్ అయ్యారు. దీంతో ఈ ముగ్గురి ఫోటోలను యాడ్ చేసి ఈ సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే అసలైన పూజా కార్యక్రమం ఫోటో అని.. ఈ ఫోటోను ప్రెస్ మీడియా వారు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా.. అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అయ్యింది. అయితే సమంతను టీజ్ చేసేందుకే విజయ్ దేవరకొండ ఇలా మార్ఫింగ్ చేసిన ఫోటోను వదిలాడని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా సమంతను విజయ్ దేవరకొండ టీజ్ చేయడం మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.