VD-Samantha: విజయ్ దేవరకొండ, సమంత సినిమా షురూ!

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న తాజా సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

VD-Samantha: విజయ్ దేవరకొండ, సమంత సినిమా షురూ!

Vd Samantha

VD-Samantha: టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న తాజా సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి శివ నిర్వాణ దర్శకుడు. నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో 19వ చిత్రమిది. విజయ్ దేవరకొండ 11వ చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.

Samantha: ‘శాకుంతలం’కు శుభం కార్డు వేసిన సమంత!

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. గీత గోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

Vijay Devarakonda : ఆగస్టు 25.. అర్జున్ రెడ్డి వర్సెస్ లైగర్

ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా.. ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ ఫ్లెజ్డ్ గా తెరపై చూపించబోతోంది. ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం.

Vijay Devarakonda: ఫుల్ జోష్‌లో రౌడీ హీరో.. విజయ్ కాన్ఫిడెన్స్‌కి రీజనేంటి?

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పిలలో మిగతా షూటింగ్ జరుపుకుంటుంది.