Bipin Rawat in Leaf Art : రావిఆకులో బిపిన్‌ రావత్ రూపం..కళాకారుడి ‘పత్ర’ నివాళి!…

దివంగత భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు పత్ర కళాకారుడు రావి ఆకుతో నివాళి అర్పించాడు.

Bipin Rawat in Leaf Art : రావిఆకులో బిపిన్‌ రావత్ రూపం..కళాకారుడి ‘పత్ర’ నివాళి!…

Bipin Rawat In Leaf Art (1)

Updated On : December 11, 2021 / 4:15 PM IST

Ravi Leaf Art Paying Tribute To CDS Bipin Rawat : భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆయన భార్యతో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్‌ భారతదేశం కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. ఎంతోమంది ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. అలా బిపిన్ రావత్ కు ఓ పత్ర కళాకారుడు వినూత్నంగా నివాళి అర్పించారు.

Read more : Final Goodbye : రావత్ దంపతుల చితాభ‌స్మాన్ని గంగాన‌దిలో కలిపిన కుమార్తెలు

పత్ర కళాకారుడు శశి అడ్కర్ ‘రావి ఆకు‘ పై బిపిన్‌ రావత్‌ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. ఆ ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి ‘తేరి మిట్టి’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు ఆ కళాకారుడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. కేంద్ర మంత్రి ‘నీ కళాకృతికి సెల్యూట్‌” అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్‌ చేశారు.