Viral Video: తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్తలు

త్యాగరాజన్ వెళ్ళే దారిలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే.అన్నమలై రావాల్సి ఉంది. అన్నమలైకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఆ సమయంలో త్యాగరాజన్ అటుగా వెళ్తుండడం చూసి ఆయనకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. కొందరు మరింత రెచ్చిపోయి కారును అడ్డుకుని, చెప్పు విసిరారు.

Viral Video: తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్తలు

Viral Video

Updated On : August 13, 2022 / 6:30 PM IST

Viral Video: తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపై బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. మధురైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డి.లక్ష్మణన్ కు నివాళులు అర్పించేందుకు పళనివేల్ త్యాగరాజన్ మధురై వెళ్ళారు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. త్యాగరాజన్ వెళ్ళే దారిలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే.అన్నమలై రావాల్సి ఉంది.

అన్నమలైకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఆ సమయంలో త్యాగరాజన్ అటుగా వెళ్తుండడం చూసి ఆయనకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. కొందరు మరింత రెచ్చిపోయి కారును అడ్డుకుని, చెప్పు విసిరారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసుల తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. మంత్రి కారుపై చెప్పు విసిరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. త్యాగరాజన్ కారును అడ్డుకుని బీజేపీ కార్యకర్తలు పాల్పడ్డ చర్యపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు.

త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్తలు