కామ్రేడ్ భారతక్క : విరాటపర్వంలో ప్రియమణి లుక్

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 05:16 AM IST
కామ్రేడ్ భారతక్క : విరాటపర్వంలో ప్రియమణి లుక్

Updated On : June 4, 2020 / 5:16 AM IST

మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం..అంటూ ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్న ‘ప్రియమణి’ లుక్ ను విడుదల చేశారు. అడవిలో చెట్ల నడుమ ప్రియమణి నిలబడి ఉంది. వీపుకు తగిలించుకున్న బ్యాగులో తుపాకి..నల్లటి డ్రెస్ లో కనిపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ ఫొటో అందర్నీ ఆకట్టుకొంటోంది. 2020, జూన్ 04వ తేదీ ప్రియమణి బర్త్ డే కావడంతో…ఈ ఫొటోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంతేగాకుండా..ఆమె పాత్రకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు. 

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలు. ఓ సామాజిక సమస్యను చర్చిస్తూ..ఏమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. 

నేచురల్ నటన, తనదైన శైలిలో డైలాగ్స్, అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకున్న సాయి పల్లవి లుక్ ను కూడా ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మెరూన్ కలర్ లంగా వోణి ధరించి..పక్కనే బ్యాగ్ పెట్టుకుని..అడవిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద కూర్చొని అదో రకమైన చూపుతో కనిపించింది. ఈ సర్ ఫ్రైజ్ లుక్ ను విడుదల చేయడంతో విరాటపర్వం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఇతర నటుల లుక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి. 

 

Read:  థియేటర్‌లో బొమ్మ పడేదెప్పుడు : సినీ లవర్స్ ఆశలపై నీళ్లు