Bengal Panchayat Election Result : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీదే హవా

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....

Bengal Panchayat Election Result : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీదే హవా

TMC leads in majority

Updated On : July 11, 2023 / 10:02 AM IST

Bengal Panchayat Election Result : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రామ పంచాయతీలతోపాటు పంచాయతీ సమితి, జిల్లాపరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం కొనసాగుతోంది. (TMC leads in majority of seats in initial trends)

Delhi-Meerut Expressway : ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురి మృతి

పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే 2,546 పంచాయతీల్లో టీఎంసీ అభ్యర్థులు ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 21 గ్రామ పంచాయతీల్లో ఆధిక్యంలో ఉన్నారు. డైమండ్ హార్బరులోని ఫకీర్ చంద్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో బాంబు విసిరారు. పశ్చిమ మేధినీపూర్ గ్రామ పంచాయతీలో టీఎంసీ అభ్యర్థులు 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Bengal Panchayat Election Result : భారీ బందోబస్తు మధ్య బెంగాల్ పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ

నాడియా గ్రామ పంచాయతీలోనూ టీఎంసీ అభ్యర్థులు 73 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బంకురా గ్రామ పంచాయతీలోనూ 37 సీట్లలో టీఎంసీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. కూచ్ బెహార్ జిల్లాపరిషత్ స్థానంలో టీఎంసీదే హవా కొనసాగుతోంది. ప్రస్థుతం వెలువడుతున్న పంచాయతీ ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థుల హవానే కొనసాగుతోంది.