Sri Lanka: రష్యాపై ఆంక్షలు విధిస్తే ఏం ప్రయోజనం?: ‘సంక్షోభం’పై శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యాపై ఆంక్షలు విధించినంత మాత్రాన అది మోకరిల్లబోదని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. అంతేగాక, రష్యాపై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఇతర దేశాలపై పడి ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు.

Sri Lanka Pm Ranil Wickremesinghe
Sri Lanka: ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యాపై ఆంక్షలు విధించినంత మాత్రాన అది మోకరిల్లబోదని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. అంతేగాక, రష్యాపై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఇతర దేశాలపై పడి ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. చమురు ధరల పెరుగుదల, నిత్యావసరాల కొరత, ఆదాయం తగ్గుదల వంటి పరిణామాలతో దాదాపు 60 లక్షల మంది శ్రీలంక ప్రజలకు ఆహారం అందడం గగనంగా మారిందని ‘ప్రపంచ ఆహార కార్యక్రమ’ సంస్థ కొన్ని రోజుల క్రితమే తెలిపింది. ఈ నేపథ్యంలో రణిల్ విక్రమ సింఘే రష్యాపై ఆంక్షల గురించి మాట్లాడడం గమనార్హం.
IndVsEng 3rd ODI : పంత్ వీరోచిత సెంచరీ.. మూడో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు కృషి చేసి, ప్రపంచ దేశాల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన ప్రపంచ దేశాలను కోరారు. శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి కారణం సొంత దేశ తప్పిదాలతో పాటు ప్రపంచం ఎదుర్కొంటోన్న సంక్షోభం కూడా కారణమని ఆయన చెప్పారు. రష్యాపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడవు కదా? అని ఆయన అన్నారు. ఆంక్షలు ఉపయోగపడతాయని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆంక్షల వల్ల ధరలు మరింత పెరుగుతాయని చెప్పారు. ఆంక్షలు విధించడం తప్పనిసరా? అన్న విషయంపై ఆలోచించాలని అన్నారు.