Whatsapp Payments: పేమెంట్స్ మాత్రమే కాదు.. అందుకు తగిన భావం కూడా!
యూపీఐ ద్వారా పేమెంట్స్ అందించే యాప్స్ లో వాట్సప్ కూడా చేరిన సంగతి తెలిసిందే. మెసెంజర్ మాత్రమే కాదు అతిపెద్ద యూపీఏ చెల్లింపుల యాప్స్ లో

Whatsapp Payments
Whatsapp Payments: యూపీఐ ద్వారా పేమెంట్స్ అందించే యాప్స్ లో వాట్సప్ కూడా చేరిన సంగతి తెలిసిందే. మెసెంజర్ మాత్రమే కాదు అతిపెద్ద యూపీఏ చెల్లింపుల యాప్స్ లో ఇప్పుడు వాట్సాప్ కూడా దూసుకుపోతుంది. ఇక.. ఇప్పుడు వాట్సాప్ అంటే కేవలం పేమెంట్స్ మాత్రమే కాదు అందుకు తగిన భావాన్ని కూడా పేమెంట్ తో పాటే చెప్పేయాలని వాట్సాప్ తెలిపింది. ఇప్పటికే గూగుల్ పే పేమెంట్ తో పాటు బ్యాక్ గౌండ్ లో అందుకు తగ్గ భావాన్ని తెలిపేలా థీమ్ కూడా జతచేసి ఫీచర్ తీసుకొచ్చింది.
ఇప్పుడు గూగుల్ పే మాదిరే వాట్సాప్ కూడా పేమెంట్ తో పాటు థీమ్ కూడా పంపేలా అప్డేట్ తీసుకొచ్చింది. ఇది కేవలం ఇండియాలోని వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో తీసుకురావడం విశేషం. ఇకపై యూజర్లు డబ్బులు పంపే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ థీమ్ ద్వారా తమ భావాల్ని కూడా వ్యక్తపరచవచ్చని వాట్సప్ అభిప్రాయపడింది. సందర్భాన్ని బట్టి ఈ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ను ఎంచుకొని యూజర్లు తమ భావాన్ని వ్యక్తపరచవచ్చని వాట్సాప్ పేమెంట్స్ డైరెక్టర్ మనేశ్ మహాత్మే తెలిపారు.
ఉదాహరణకు రక్షాబంధన్ సందర్భంగా సోదరికి డబ్బు పంపుతున్నట్లైతే.. రాఖీతో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను జత చేయవచ్చు. అలాగే బర్త్ డేలకు కేక్, క్యాండిల్స్‌తో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను చేర్చవచ్చు. తమ దృష్టిలో డబ్బులు పంపడం, పొందడం అనేది కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదని.. వాటి వెనుక వెలకట్టలేని భావాలు ఉండొచ్చని మనేశ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుల్లో పేమెంట్స్ ఫీచర్‌ను మరింత ఆకర్షణీయంగా, సులభతరంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మనీష్ తెలిపారు.