Zydus Virafin Drug : భారత్‌లో కరోనాను అంతం చేసే కొత్త డ్రగ్ వచ్చేసింది!

A Breakthrough Drug That Could Turn Around India's Covid Graph Total
Zydus Cadila Virafin Drug : భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే కొత్త డ్రగ్ వచ్చేసింది. జైడస్ కాడిలా అనే ఫార్మా కంపెనీ ఈ కొత్త కరోనా యాంటివైరల్ మందును కనిపెట్టింది. జైడస్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్.. కరోనా చికిత్సలో ప్రభావంతంగా పనిచేస్తుందంట.. అందుకే భారతీయ డ్రగ్ రెగ్యులేటర్ కూడా జైడస్ మందుకు అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
Virafin, Pegylated Interferon alpha-2b (PegIFN) అనే ఈ డ్రగ్ కరోనా సోకిన మధ్య స్థాయి వ్యక్తుల్లో అందించే చికిత్సలో అద్భుతంగా పనిచేస్తోందని జైడస్ చెబుతోంది. జైడస్ అందించిన వివరాలపై నిపుణుల కమిటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. జైడస్ కు చెందిన యాంటివైరల్ డ్రగ్ విరాఫిన్ కు డీసీజీఐ అత్యవసర అనుమతినిచ్చింది. మధ్యస్థాయి రోగులపై విరాఫిన్ అద్భుతంగా పనిచేస్తోందని కంపెనీ స్పష్టం చేసింది. కరోనా సోకిన బాధితుల్లో ప్రారంభ దశలోనే ఈ విరాఫిన్ డ్రగ్ తో చికిత్స అందించడం ద్వారా తొందరగా కోలుకుంటారని, తీవ్ర అనారోగ్య సమస్యలను దూరం చేయగల సత్తా దీనికి ఉందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆస్పత్రిలోని వైద్య నిపుణులు సూచించిన ప్రిస్‌క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ఈ విరాఫిన్ డ్రగ్ అందించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. యాంటీవైరల్ విరాఫిన్ ఒకే మోతాదుతో రోగులకు చికిత్సను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 నుంచి 25 సెంటర్లలో ఈ మల్టీ సెంట్రిక్ ట్రయల్స్ నిర్వహించింది. విరాఫిన్ మందు తీసుకున్న వారిలో ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరాన్ని పూర్తిగా తగ్గించిందని తేలింది.
కోవిడ్ వైరస్ పై మాత్రమే కాదు.. ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లపై కూడా సమర్థవంతమైన పనిచేయగలదని ట్రయల్స్ లో రుజువైందని పేర్కొంది. కరోనా సోకిన వెంటనే ఈ డ్రగ్ థెరపీ తీసుకోవడం ద్వారా అధిక వైరల్ లోడ్ తీవ్రతను తగ్గించగలదని అంటోంది. ఈ డ్రగ్ పూర్తిగా అందరికి అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెబుతోంది. మూడో దశ ట్రయల్స్ లో ఈ థెరపీతో కరోనా బాధితుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొంది.