Ajwain Benefits : ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌కి శక్తివంతమైన నివారణిగా తోడ్పడే వాము !
వాము గింజలను మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. కూరలు, రోటీలు , భోజనం తర్వాత తీసుకోవచ్చు. భోజనంలో వాము గింజలు జోడించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు.

vamu
Ajwain Benefits : వాము గింజలు వంటలలో రుచిని మెరుగుపరచడానికి , జీర్ణక్రియను సులభతరం చేయడానికి తరచుగా ఉపయోగిస్తుంటారు. భారతీయుల వంటగది తప్పనిసరిగా ఉండే మసాలా దినుసులలో వాము కూడా ఒకటి. ఆయుర్వేదంలోని వాము ఒక శక్తివంతమైన పదార్ధంగా పరిగణించబడుతుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.
READ ALSO : Carom Seeds : అజీర్తి తగ్గి ఆకలి పెరగాలంటే ఒక టీ స్పూన్ వామును అన్నంతో కలిపి తీసుకున్నా చాలు!
ఫుడ్ పాయిజనింగ్ , ఎసిడిటీ సమస్యల విషయంలో చాలా వరకు వామును పచ్చిగా లేదా చిటికెడు ఉప్పుతో కలిపి తినాలని సిఫార్సు చేస్తారు. ఈ శక్తివంతమైన వాము గింజలు పాలిచ్చే తల్లులు ఆహారంలో తీసుకుంటే ఎంతగానో మేలు కలిగిస్తాయి.
వాము ప్రయోజనాలు ;
1. ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం: ఋతుస్రావం సమయంలో ఎదుర్కొనే తిమ్మిరిని తగ్గించటానికి వాము నీరు ఒక ప్రభావవంతమైన నివారణగా ఉపకరిస్తుంది. వాము నీటిని తయారు చేయడానికి ½ టేబుల్ స్పూన్ వాము గింజలు, ½ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపుకుకోవాలి. పీరియడ్స్ సమయంలో నొప్పి నివారణ మందులు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుంది.
READ ALSO : వాముతో జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలకు చెక్!
2. రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది: వాము గింజలను మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. కూరలు, రోటీలు , భోజనం తర్వాత తీసుకోవచ్చు. భోజనంలో వాము గింజలు జోడించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
3. ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం: వాము శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, హషిమోటో మొదలైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పానీయాలు, కూరలు, పరోటాలు వంటి వాటిలో తప్పనిసరిగా వామును తీసుకోవటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
READ ALSO : Ajwain Jeera Tea : రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగుపరిచే వాము, జీలకర్ర టీ!
4. జీర్ణ సమస్యలు: వాము వినియోగం అపానవాయువు, అజీర్ణం, కడుపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అజ్వైన్‌తో తయారు చేసిన టీని తాగటం వల్ల అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
5. పాలిచ్చే తల్లులకు మేలు చేసే వాము ; వాముకున్న శక్తివంతమైన వైద్య లక్షణాలు పాలిచ్చే తల్లులకు మేలుకలిగిస్తాయి. దీనిని ఆహారంలో చేర్చుకోవాలని పాలిచ్చే తల్లులకు ఆయుర్వేదనిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే ఇది వారిలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.