Diabetes Pregnant : మధుమేహం ఉన్నవారు గర్భదారణా?…జాగ్రత్తలు తప్పనిసరి?

తల్లి రక్తంలోని గ్లూకోజు మాయ ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇన్సులిన్‌ ఆవిధంగా ప్రవేశించలేదు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ రక్తంలో గ్లూకోజ్‌ అధికమవుతుంది.

Diabetes Pregnant : మధుమేహం ఉన్నవారు గర్భదారణా?…జాగ్రత్తలు తప్పనిసరి?

Diabetes Pregnant

Updated On : February 27, 2022 / 6:28 PM IST

Diabetes Pregnant : మధుమేహంతో బాధపడుతున్న మహిళలు పిల్లలను కనాలని భావిస్తే ముందస్తుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవటం ఎంతో అవసరం. గర్భదారణ అయింది మొదలు డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవటం చాలా అవసరం. వైద్యుల పర్యవేక్షలో ఉండటంవల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతోపాటు డెలివరీ సమయంలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మధుమేహం కారణంగా పిల్లలు పుట్టకపోవటం వంటి సమస్యలు లేకపోయినప్పటికీ , తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం మాత్రం లేకపోలేదు.

గర్భధార ణ సమయంలో, గర్భాన్ని దాల్చిన 8 వారాల వరకు బ్లడ్‌గ్లూకోజ్‌స్ధాయి అధికంగా ఉంటే అది కడుపులో బిడ్డ పెరుగు దలను దెబ్బతీసే ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకుంటూ డాక్టరు పర్యవేక్షణలో ఉండటం మంచిది. గర్భిణీ స్త్రీ రక్తంలో గ్లూకోజ్‌ అధికస్థాయిలో ఉంటే ఆమె కడుపులో ఉన్న పాపాయి రక్తంలో కూడా గ్లూకోజు అధికస్థాయిలో ఉండేందుకు అవకాశాలు ఉంటాయి.

తల్లి రక్తంలోని గ్లూకోజు మాయ ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇన్సులిన్‌ ఆవిధంగా ప్రవేశించలేదు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ రక్తంలో గ్లూకోజ్‌ అధికమవుతుంది. దీనివల్ల కడుపులో బిడ్డ సాధారణం కన్నా వేగంగా బరువు పెరగటం ప్రారంభమౌతుంది. కడుపులో బిడ్డ మామూ లుకన్నా వేగంగా పెరగటంతో శరీర పరిమాణం పెద్దగా ఉంటుంది. దీనివల్ల డెలివరీ సమయంలో ఎక్కవ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అలాగే పుట్టే బిడ్డకు శ్వాస సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. టైప్‌ 1 డయాబెటిస్‌ కలిగిన మహిళ కడుపుతో ఉన్న రోజుల్లో బ్లడ్‌ షుగర్‌ని అదుపులో ఉంచుకోకపోతే రక్తంలో విషపదార్ధాలుగా చెప్పబడే కీటోన్స్‌ ఉత్పత్తి అయే ప్రమాదం ఉంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ కీటోన్స్ హాని కలిగిస్తాయి. కొన్ని పర్యాయాలు బిడ్డకు ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు.

మధుమేహం గల స్త్రీ గర్భాన్ని దాల్చిన ప్పుడు బ్లడ్‌షూగర్‌ పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. న్యూట్రిషనిస్టు సలహామేర ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచుకునేందుకు వాకింగ్‌ లాంటివి చేయాలి. డైటింగ్‌ వంటివి చేయకూడదు. వైద్యుల పర్యవేక్షణలో ఉండి వారి సూచనలు, సలహాలు పాటించటం ఉత్తమం.