Hair : కురుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి?..
జట్టును కత్తిరించుకోకుండా అదే పనిగా పెంచుకుంటూ పోతే కొంతకాలానికి జుట్టు కొసలు చిట్లిపోతాయి. పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం సమస్య అధికంగా ఉంటుంది.

Hair
Hair : తల వెంట్రుకలు ముఖానికే అందాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా మహిళల విషయంలో పొడవైన కేశాలు కలిగిన మహిళలు చూడటానికి అందంగా కనిపిస్తారు. అయితే జుట్టు విషయంలో చేసే అనేక పొరపాట్ల కారణంగా సమస్యలు తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది. జుట్టు విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కురులను ఆరోగ్యవంతంగా కాపాడుకోవచ్చు.
మాడుకు రక్తప్రసరణ బాగా అందుతుందని జుట్టు మృదువుగా, మెరుపుగా అవుతుందని అదే పనిగా జుట్టును దువ్వేస్తుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. ఎక్కువ సార్లు దువ్వడం వల్ల జుట్టు లాగినట్లుగా అవుతుంది, జుట్టు కుదుళ్లు పాడైపోతాయి. జుట్టు కొసలు చిట్లుతాయి. జుట్టు స్వభావాన్ని బట్టి దువ్వెలనలను వినియోగించాలి. ఒత్తుగా, కర్లీగా ఉన్న జుట్టుకి పళ్ళు వెడల్పుగా ఉన్న దువ్వెన కావాలి. స్టైలింగ్ కి రౌండ్ బ్రీజిల్స్ ఉన్న దువ్వెన వాడాలి. బాగా చిక్కు పడే జుట్టుకి బ్రష్‌ను ఎంచుకోవాలి.
జట్టును కత్తిరించుకోకుండా అదే పనిగా పెంచుకుంటూ పోతే కొంతకాలానికి జుట్టు కొసలు చిట్లిపోతాయి. పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం సమస్య అధికంగా ఉంటుంది. రెండు నెలలకి ఒకసారైనా హెయిర్ ట్రిమ్ చేయించుకోవటం వల్ల జట్టు చిట్లే సమస్యను నివారించుకోవచ్చు. ఒకసారి వెంట్రుకలు చిట్లాక ఏ షాంపూ, నూనె వాడినా ప్రయోజనం ఉండదు. జట్టుకు తగినంత పోషణను అందించేందుకు అయిల్స్ ను అప్లై చేస్తుండాలి. కొన్ని రకాల జుట్టు సమస్యలకు అయిల్ పెట్టేటమే పరిష్కారంగా చెప్పవచ్చు. తల స్నానానికి ముందు నూనె పెట్టటం వల్ల జుట్టుకు రక్షణ కవచం ఏర్పడుతుంది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అప్లై చేయటం మంచిది.