Sitting Risks : రోజులో అధిక సమయం కూర్చునే ఉంటున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు…
తీసుకున్న ఆహరం జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే, తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోతుంది.

Sitting Risks :
Sitting Risks : గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. గతంలో 60 ఏళ్ళ వయసు వచ్చాక నడుం నొప్పి , వెన్నుపూసకి సంబందించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం యుక్త వయసులోనే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 25 ఏళ్ళు నిండకుండానే నడుం నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా వారు ప్రతిరోజు కూర్చుని పని చేయడమే అంటున్నారు నిపుణులు. ఇలా ఒకే చోట కదలకుండా ఉండడం వల్ల ఊబకాయం సమస్య కూడా ఉత్పన్నమవుతుంది.
ఎక్కువ సమయం కూర్చుని ఉండడం వల్ల ప్రధానంగా వెన్నుముకకి సంబంధించిన సమస్యలు వస్తాయి. వెన్నుపూస కూడా దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. శరీర జీవక్రియల వేగం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కూర్చుని ఉండడం వల్ల కొలెస్ట్రాల్ కూడా పేరుకుపోయి గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
నడవకుండా ఉండటం చేత, అరికాళ్ళు & కాళ్లకు అనుకున్న రీతిలో రక్తప్రసరణ జరగక కాళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చి కీళ్లు బలహీనంగా మారతాయి. కండరాల బలహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. కూర్చుని ఉండడం వల్ల నడుము భాగం క్రింద ఉన్న అన్ని రకాల కండరాలు బలహీన పడతాయి. తల కూడా అటు ఇటు తిప్పకుండా పనిచేస్తుంటే కొంతకాలం తరువాత మెడ నరాలలో కదలిక లేక కొత్త సమస్యలు వస్తాయి. అలాగే అటు ఇటు కదలించకపోతే మెడ నొప్పులు వస్తాయి.
READ ALSO : Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?
తీసుకున్న ఆహరం జీర్ణమైన తరువాత వచ్చే పోషకాలు మన శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా వెళతాయి. అలా కాకుండా తిన్న వెంటనే కదలకుండా ఒకే చోట కూర్చుంటే, తిన్నది మొత్తం ఒకే చోట కొవ్వులా పేరుకుపోతుంది. ఊబకాయ సమస్య కూడా వస్తుంది. ఊబకాయం సమస్య తీవ్రమైతే డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొవ్వు బాగా పేరుకుపోవడంతో హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరానికి సరిపడా నీరు కూడా అందివ్వకపోతే మీకు కిడ్నీలో రాళ్లు వచ్చేస్తాయి. దీని ద్వారా కిడ్నీ సంబంధిత బాధలు కూడా ఎదురుకోవాల్సి వస్తుంది. శరీరాన్ని కదల్చకుండా ఉంటేకి శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం, మెటబాలిజం లో తేడాలు, గుండెపోటుకి దారి తీసే అవకాశాలు ఎదురవుతాయి.
సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;
ప్రతిరోజు 30 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. 8 నుండి 10 గంటల పాటు ఒకే చోట కూర్చుని పనిచేసే వారు కచ్చితంగా ప్రతి గంటకు ఒకసారైనా లేచి అటు ఇటు కనీసం రెండు నిమిషాలైనా నడవాలి. అలా నడవడం ద్వారా మీ శరీరం కదలికలు ఉంటాయి.
READ ALSO : Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?
లిఫ్ట్ లేదా ఎలివేటర్లు వాడడం కన్నా మెట్లు ఎక్కడం మంచిది. ఇలా చేస్తే, మీ శరీర భాగాలకి అవసరమైన కదలిక ఏర్పడతాయి. ఎక్కువగా కూర్చుని పని చేసే వారు, గంట లేదా రెండు గంటలకొకసారి నీరు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. జంక్ ఫుడ్ తగ్గించి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
రోజు వ్యాయామం చేసే సమయంలేకపోతే, వారంలో కనీసం మూడు నుండి నాలుగు రోజుల పాటు రోజుకొక గంటసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.