Foot Pain Home Remedies : పాదాల నొప్పితో బాధపడుతున్నారా ! నొప్పిని తగ్గించే ఇంటి నివారణ చిట్కాలు ఇవే !

మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది.

Foot Pain Home Remedies : పాదాల నొప్పితో బాధపడుతున్నారా ! నొప్పిని తగ్గించే ఇంటి నివారణ చిట్కాలు ఇవే !

foot pain

Foot Pain Home Remedies : కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. దీని వల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ పాదాల నొప్పులు అనేవి ఏ సీజన్‌లో అయినా రావచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. పాదాల నొప్పులకు కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు, చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం మొదలైనవి కారణాలు. నొప్పినిని వదిలించుకోవడానికి వివిధ రకాల మందులు తీసుకుంటూ ఉంటారు.. అయితే ఔషధం ప్రభావం తగ్గిపోయిన వెంటనే, నొప్పి మళ్లీ మాములుగానే వస్తుంది. ఈ పరిస్థితిలో కొన్ని ఇంటి నివారణల చిట్కాలు సహాయంతో పాదాల నొప్పి నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Shoe Bites : షూ కాటును నివారించాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి !

పాదాల నొప్పి నివారణ చిట్కాలు ;

1. అల్లం

మడమ నొప్పి నుండి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లంను చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించాలి. ఇలా చేయటం వల్ల చీలమండల నొప్పి నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

2. పసుపు

మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపు నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి , వాపు తగ్గుతుంది.

READ ALSO : Summer Sweat : వేసవిలో అధిక చెమట ఎందుకుపడుతుంది? అధిక చెమటలను ఆపాలంటే !

3. చేప

ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి నొప్పి , వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్

మడమల నొప్పి. వాపుతో సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కొన్ని నీటిని వేడి చేసి దానిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఈనీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

READ ALSO : Cracked Heels : పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారా? పైనాపిల్ తో ఇలా చేసి చూడండి!

5. రాతి ఉప్పు

మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్ సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10-15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.

6. లవంగం నూనెతో మసాజ్ చేయండి

మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగం నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

READ ALSO : Fatty Liver Disease : శరీర భాగాల్లో ఈ 5 ప్రదేశాల్లో వాపు వస్తే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతమా !

7. ఐస్ క్యూబ్స్

మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుండి నాలుగు సార్లు ఐస్ క్యూబ్ లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.