Anxiety : యాంగ్జైటీ తగ్గాలంటే ఈ 5 అలవాట్లు మానేయండి..

యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే ఆందోళనను పెంచే అంశాలకు దూరంగా ఉండాలి. ఈ ఐదు అలవాట్లు మానేస్తే ఆందోళనను తగ్గించడంలో సహకరిస్తాయి. ఏంటవి అంటే?

Anxiety : యాంగ్జైటీ తగ్గాలంటే ఈ 5 అలవాట్లు మానేయండి..

Anxiety

Updated On : October 27, 2023 / 12:58 PM IST

Anxiety : యాంక్జైటీ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న మానసిక ఆరోగ్య సమస్య. ఇది అప్పుడప్పుడు ఎదురైతే సహజమే కానీ ఒక్కోసారి ఈ పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తుంది. అలాంటి సమయంలో ఎలా బయటపడాలి? అంటే..

కెఫిన్ వినియోగం తగ్గించాలి:
చాలామందిలో కాఫీ తాగకుండా డే స్టార్ట్ కాదు. డేలో ఒకసారి కాఫీ తాగితే సమస్య లేదు. కొందరు అదే పనిగా తాగుతుంటారు. కెఫిన్ ఆందోళనకు గురయ్యేవారిలో మరింత భయం, ఆందోళనను పెంచుతుంది. అందువల్ల కెఫిన్ తీసుకోవడం పరిమితం చేస్తే మంచిది.

Prevent Respiratory Problems : శ్వాసకోశ సమస్యలు నిద్రకు భంగం కలిగిస్తుంటే నివారణకు సహజ చిట్కాలు !

పనులు వాయిదా వేయకండి :
కొందరు ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. అది కూడా ఆందోళనను పెంచుతుంది. సమయం ఉంది కదా అని కాకుండా అనుకున్న పనుల్ని దశల వారీగా డివైడ్ చేసుకుని త్వరితగతిన పూర్తి చేసుకుంటే ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

సరైన నిద్ర అవసరం :
నిద్రకి ఆందోళనకి దగ్గర సంబంధం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోతే ఆందోళన ఎక్కువ అవుతుంది. రోజువారి ఒత్తిళ్లను ఎదుర్కోవడం సవాలుగా మారుతుంది. ప్రతిరోజు వేళకు నిద్రపోవడం అనే అలవాటు చేసుకోవడం వల్ల యాక్టివ్‌గా ఉండగలుగుతారు. మంచి నిద్ర ఆందోళనను తగ్గించడంలో దోహదం చేస్తుంది.

అలారం పెట్టుకుని నిద్ర లేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా

సోషల్ మీడియాకి దూరంగా ఉండటం :
అదే పనిగా సోషల్ మీడియాలో ఉండటం కూడా ఆందోళనను మరింత పెంచుతుంది. సోషల్ మీడియా, వార్తలు పనిచోట ఇమెయిల్‌లు మెదడుని గజిబిజి చేస్తాయి. దాంతో రిలాక్స్ అవ్వడానికి కష్టమవుతుంది. స్క్రీన్ సమయాన్ని తగ్గించడంతోపాటు ఇష్టమైన పనుల్లో గడపడం ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం :
కొందరు ప్రతి విషయాన్ని.. ముఖ్యంగా తమకు సంబంధించిన అనేక అంశాలను నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. అది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనిని ఎదుర్కోవాలంటే తమపై తాము నమ్మకం కలిగి ఉండాలి. తమ గురించి తాము ప్రతికూల ఆలోచనలు చేయడం వల్ల అవి ఏ విధంగానైనా సహాయపడ్డాయా? అనే ప్రశ్నించుకోవాలి. ఇలాంటి అలవాట్లను మానేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.