Reduce Gas Problem : ఈ ఆహారాలకు దూరంగా ఉంటే గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు!
జీర్ణక్రియకు ఎక్కువ సమయాన్ని తీసుకొనే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ కి కారణం అవుతాయి. పిండిపదార్ధాలు అధికంగా వుండే, బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ , బ్రెడ్ మొదలైనవి గ్యాస్ సమస్యలను మరింత రెట్టింపు చేస్తాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండి ఆ సమస్య రాకుండా చూసుకోవచ్చు.

Avoiding these foods can reduce gas problem!
Reduce Gas Problem : జీవన శైలి, ఆరోగ్య అలవాట్ల కారణంగా ఎక్కువమందిలో గ్యాస్ సమస్య తో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ సాధారణ సమస్యగా ఇది మారిపోయింది. మనం తీసుకునే ఆహారంతో, తాగే ద్రవపదార్థాలతో, లాలాజలంతో శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేన్పు రూపంలో బైటకు వెళుతుంది. మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి, అక్కడనుంచి శరీరంలోకి కలిసిపోతుంది. మిగిలిన కొద్ది బాగం, నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్ రూపంలో వెళ్లిపోతుంది.
ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం, గ్యాస్‌తో నిండిన కూల్‌డ్రింకులను, సోడాలను తాగడం, పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్ గమ్‌లు అదే పనిగా నములుతుండటం, మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి తప్పులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యని అధిగమించటానికి అనేక చిట్కాలు ఉన్నాయి. అయితే గ్యాస్ సమస్యను అధికం చేసే ఆహారాలకు దూరంగా ఉంటే గ్యాస్ సమస్యను కొంత మేర తగ్గించుకోవచ్చు.
గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే ;
కొన్ని రకాల పప్పు ధాన్యాలు, బీన్స్, మష్రూమ్స్, ఆపిల్స్ మొదలైన షుగర్ కంటెంట్అధికంగా వుండే ఆహారాలను శరీరం సరిగా జీర్ణం చేసుకోదు. అలాంటి వాటిని తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వాటిరి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. పాలలో ఉండే లాక్టోజ్ సరిగా జీర్ణం కొంత మందిలో గ్యాస్ సమస్య ఉత్పన్నం అవుతుంది.జున్ను, పాలు, గుడ్లు, గుడ్డు సొన వంటి గ్యాస్ సమస్యను అధికం చేసే ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్.
జీర్ణక్రియకు ఎక్కువ సమయాన్ని తీసుకొనే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ కి కారణం అవుతాయి. పిండిపదార్ధాలు అధికంగా వుండే, బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ , బ్రెడ్ మొదలైనవి గ్యాస్ సమస్యలను మరింత రెట్టింపు చేస్తాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండి ఆ సమస్య రాకుండా చూసుకోవచ్చు. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మంచి నీళ్లు ఎక్కువగా తాగకపోవడం , కొన్ని రకాల మందుల వాడకం, దీర్ఘకాలం డీ హైడ్రేషన్ బారిన పడటం తదితర కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గ్యాస్ సమస్య నుండి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.