Loneliness : ఒంటరితనం నుంచి ఇలా బయటపడండి

చుట్టూ వందమంది ఉన్నా కొన్ని సార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అలా చాలా మందికి జరుగుతుంటుంది. ఆ సమయంలోఇంకెవరో మనతో ప్రేమగా లేరన్న ఆలోచన వదిలేయాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం పైన దృష్టి పెట్టాలి.

Loneliness : ఒంటరితనం నుంచి ఇలా బయటపడండి

loneliness

Updated On : July 30, 2023 / 11:28 AM IST

Loneliness : మనిషి సంఘజీవి. చుట్టూ పదిమంది మనుషులుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. లేకుంటే ఒంటరితనంతో బాధపడుతాం. అయితే ఏకాంతానికి ఒంటరితనానికి చాలా తేడా ఉంది. ఏకాంతంలో ఒంటరిగా ఉన్నపుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒంటరితనంలో ఒక్కరమే ఉన్నామన్న భావనే మనసును ఇబ్బంది పెడుతుంది. అందరితో కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, దగ్గరి స్నేహితులు లేకపోవడం, జీవనశైలి మార్పులు, మనస్పర్థలు.. ఇలా చాలా కారణాల వల్ల ఒంటరిగా ఉన్నామనే భావన రావచ్చు.ఇలాంటప్పుడు సొంత ప్రయత్నంతో ఆ నెగటివ్ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు. ఇందుకు ఏం చేయాలంటే….

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు

 నెగటివ్థాట్స్:ఒంటరిగా ఉంటే మొదట మనసులో లేనిపోని వ్యతిరేక ఆలోచనలు మొదలవుతాయి. వాటిని గుర్తించి నిజాలేంటో తెలుసుకుని, ఆ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. సమస్య ఏదైనా దానిలో పాజిటివ్ కోణం గురించి ఆలోచించాలి. మన ఎక్స్ పెక్టేషన్లు కూడా వాస్తవదూరం లేకుండా చూసుకోవాలి.

సెల్ఫ్ లవ్:చుట్టూ వందమంది ఉన్నా కొన్ని సార్లు ఒంటరిగా అనిపిస్తుంది. అలా చాలా మందికి జరుగుతుంటుంది. ఆ సమయంలోఇంకెవరో మనతో ప్రేమగా లేరన్న ఆలోచన వదిలేయాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం పైన దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని ముందుకు కదలాలి.

READ ALSO : Healthy Hair : జుట్టుకు ఏది బెస్ట్.. డెర్మటాలజిస్టులు ఇస్తున్న సూచనలు

ఇష్టమైన పనులు: కొత్త పనులు కాకుండా మీకేమిష్టమో అవే పనులు చేయండి. పెయింటింగ్, డెకొరేటింగ్,షాపింగ్, ఇష్టమైన ఆహారం తినడం, వండటం.. ఇలా మీకిష్టమైన పనిచేస్తే చాలావరకు బాధ తగ్గుతుంది.

కృతజ్ఞత:ఒక రోజులో మనకు చాలా విషయాలు కలిసొస్తాయి. అన్నీ కలిసొస్తేనేఆరోజు గడుస్తుంది.ఆరోజుజరిగిన మంచి విషయాలేంటో ఒక దగ్గర రాసుకోండి. మీ జీవితం మీకు చేసే మేలు తెలుస్తుంది. మీమీద మీకే కృతజ్ఞతా భావం పెరుగుతుంది.

కలుస్తూ ఉండండి:మీరిదివరకూ ఎవరితో మాట్లాడేవారో వాళ్లతో మళ్లీ టచ్‌లో ఉండండి. వాళ్లతో మాట్లాడండి. వీలైతే కలిసి బయటికి వెళ్లండి. దీనివల్ల మీకే కాదు.. వాళ్లకీ సాయం జరగొచ్చు.

READ ALSO : Cattle Diseases : వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులు.. రైతులు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు

సోషల్ యాక్టివిటీస్:క్లబ్స్, క్లాసెస్, గ్రూప్స్‌లో చేరండి. హాబీలు, ఆటలకు తగ్గట్లు వీటిని ఎంచుకోవచ్చు. కొత్త మనుషులు, కొత్త బంధాలకు దగ్గరవుతారు.

సపోర్ట్ :స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోండి. ఆన్‌లైన్ కమ్యూనిటీలు లేదా హెల్ప్‌లైన్‌లు కూడా మంచి సపోర్ట్ ని అందిస్తాయి.

సేవా కార్యక్రమాలు:ఏవైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏవైనా సంస్థల్లో వలంటీర్‌గా చేరడం వల్ల కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీకు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

READ ALSO : Paddy Cultivation : ఖరీఫ్ వరి నారుమడులు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం మేలైన యాజమాన్యం

శ్రద్ధగా వినండి:ఇతరులతో మాట్లాడేటపుడువారేం చెబుతున్నారో శ్రద్ధగా వినండి. వాళ్ల బాధను అర్థం చేసుకున్నాకే సమాధానం ఇవ్వండి. వాళ్లకుతోడుగా నిలబడండి. దీనివల్ల వేరేవాళ్లతో సంబంధాలు బలపడతాయి.

ఒంటరితనం నుంచి బయటపడటానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ ఈ సమయంలో ఎటువంటి నెగటివ్ ఆలోచనలూ చేయొద్దు. ఏమాత్రం నెగటివ్ గా అనిపించినా మీ దగ్గరివాళ్లతో పంచుకోండి. పాత బంధాలను బలపరుచుకుంటూనే, కొత్త బంధాలను ఏర్పరుచుకోండి. అవసరంలో ఉన్నామనుకున్నప్పుడు హెల్ప్ అడగడానికి సంకోచించవద్దు.