Improve Heart Function : గుండె పనితీరు మెరుగుగా ఉండాలంటే అలవాట్లు, ఆహారంలో మార్పులు తప్పనిసరి!
జీవన శైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డారు. మరోపక్క శారీరక శ్రమ లేకపోవడంతో చివరికి ఇది ఊబకాయానికి దారితీస్తోంది. కరోనరీ ఆర్టరీ వ్యాధికి ఊబకాయం ప్రత్యక్షంగా కారణమౌతుంది. ఇతరులతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Changes in habits and diet are essential to improve heart function!
Improve Heart Function : ప్రస్తుతం గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య అధికమైంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణంగా నిపుణులు చెబుతున్నారు. బలవర్థకమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడం వంటి కారణాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవం గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇంఫ్లమేషన్ వంటి వాటిపై ప్రభావం చూపిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే గుండె ఆరోగ్యం బాగుండాలంటే దైనందిన అలవాట్లు, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1.మద్యం, ధూమపానానికి దూరంగా ; ప్రస్తుతం వచ్చే జబ్బులన్నింటికి ప్రధాన కారణం అల్కహాల్. ప్రతి వారు మద్యం సేవించడం ఓ అలవాటుగా చేసుకున్నారు. అదో ప్రత్యేకమైన ఫ్యాషన్ గా మారిపోయింది. పెగ్గు తాగకపోతే కిక్కు ఉండదనే ధోరణికి అందరు వచ్చేశారు. ఇక యువత అయితే చెప్పనక్కర లేదు. రాత్రి అయిందంటే చాలు మందు తాగడమే వ్యసనంగా పెట్టుకున్నారు. దీంతో మన శరీరంలో అన్ని అవయవాలు పాడైపోతున్నాయి. ఫలితంగా ముప్పై ఏళ్లకే అన్ని రోగాలు ముసురుతున్నాయి. దీంతో బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. అయినా ఎవరు కూడా వినడం లేదు. మంచి చెబితే ఎవరికి కావాలి. చెడు మార్గాలైతే తొందరగా ఆచరించడం మన వారికి ఉన్న ప్రధాన లోపమే.
2.పోషకాహారం తీసుకోవటం ; సరైన ఆహారం తీసుకోకపోతే కూడా గుండెజబ్బులు వచ్చే ముప్పు పొంచి ఉంది. మనం రోజు తీసుకునే ఆహారంలో అన్నమే ప్రధానమైనది. ఇందులో కార్బోహైడ్రేడ్లు తప్ప విటమిన్లు, ప్రొటీన్లు ఉండవు. కనీసం ఒక శాతం కూడా బలమైన ఆహారం కాదు. అన్నం తింటే ఏదో కడుపు నిండిన ఫీలింగ్ కోసమే అన్నం తినడం చేస్తున్నారు. పోషకాలు ఉన్న ఆహారాలు చాలా ఉన్నాయి. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటితోనే ఆరోగ్యం ముడి పడి ఉందని తెలుసుకోవాలి. గుండె పనితీరు బాగా ఉండాలంటే అన్నం కచ్చితంగా మానేయాల్సిందే. లేదంటే ఎప్పటికైనా అన్నంతో మనకు ప్రమాదమే పొంచి ఉంటుంది.
3.బరువు తగ్గడం ; జీవన శైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డారు. మరోపక్క శారీరక శ్రమ లేకపోవడంతో చివరికి ఇది ఊబకాయానికి దారితీస్తోంది. కరోనరీ ఆర్టరీ వ్యాధికి ఊబకాయం ప్రత్యక్షంగా కారణమౌతుంది. ఇతరులతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యంవంతమైన జీవనం సాగించాలి.
4.రోజువారి వ్యాయామం ; ప్రతి రోజు వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 45-60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, జాకింగ్, యోగా వంటివి చేస్తే మంచిది. మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేస్తేనే ప్రయోజనం కలుగుతుంది. ఉదయం నడకతో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు. అందుకే మనం వీలైనంత వరకు ఉదయం పూట వాకింగ్ చేసి గుండె పనితీరును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుండెకు హాని కలిగించే వాటిని తీసుకోకపోవడమే మంచిది.
5.మంచి నిద్ర ; నిద్ర కూడా ముఖ్యమైనదే. నేటి రోజుల్లో చాలా మంది రాత్రిళ్లు తింటూ పగటిపూట నిద్ర పోతున్నారు. ఇది ప్రకృతి విరుద్ధమైన చర్య. ఎందుకంటే మనకు రాత్రి ఉన్నదే నిద్ర పోవడానికి పగలు ఉన్నదే పని చేయడానికి. కానీ కొందరు కావాలనే రాత్రి పూట మేల్కొని పగటిపూట పడుకుంటున్నారు. దీంతో మనకు రోగాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గుండె పనితీరు నియంత్రించడంలో నిద్ర కూడా ప్రధానమైనది. అందుకే రాత్రి పూట ప్రశాంతంగా పడుకుని పగటి పూట రోజువారి కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
6. ఆరోగ్యకరమైన పానీయాలు ; సాధారణ టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. మందారం ఆకులతో చేసిన టీ, టమాటా, బెర్రీ, బీట్‌రూట్ జ్యూస్‌లను తరచూ తీసుకోవాలి. దీంతో గుండె సంబంధ సమస్యల రిస్క్ తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉంటూ పొగాకు, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకుంటే మంచి ఫలితం ఉంటుంది.