Amla : లివర్ సమస్యలకు ఉసిరికాయలతో చెక్

రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరికాయలను నల్ల ఉప్పుతో కలపి తింటే మంచిది. అనవసరమైన పచ్చళ్ళకంటే ఉసిరి పచ్చడిగా చేసుకోని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Amla : లివర్ సమస్యలకు ఉసిరికాయలతో చెక్

Amla

Amla : భారతీయుల సంస్కృతీ సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక స్ధానం ఉంది. దానిని నుండి వచ్చే ఉసిరి కాయల గురించి చెప్పనక్కరలేదు. ఈ కాయల్లో ఎన్నో రకాల ఔషదగుణాలు ఉన్నాయి. ఆమ్లగా పిలవబడే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సౌందర్య సాధనాల తయారీలో, వంటకాలలో, మందుల్లో ఉసిరిని విరివిగా వినియోగిస్తారు.

ఉసిరితో తయారైన అమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఓ ఉసిరి ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. మలబద్దకాన్ని తగ్గించటంతోపాటు, కంటి చూపు మెరుగుపరచటంలో బాగా పనిచేస్తుంది. కార్తీక మాసంలో ఉసిరిచెట్టు క్రింద కూర్చుని వనభోజనాలు చేస్తే మంచిదని అంతా నమ్ముతారు.

ఉసిరి కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు లివర్ సమస్యలకు చక్కగా పనిచేస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు నిత్యం ఉసిరి కాయలను తీసుకుంటే ప్రయోజనాలు అధికమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సితోపాటు, ఐరన్ , కాల్షియం అవసరమైన మేర ఉంటాయి.

రోజుకు ఒకటి లేదా రెండు ఉసిరికాయలను నల్ల ఉప్పుతో కలపి తింటే మంచిది. అనవసరమైన పచ్చళ్ళకంటే ఉసిరి పచ్చడిగా చేసుకోని తినటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రాత్రిసమయంలో ఉసిరి కాయ ముక్కలను నీటిలో నానబెట్టి తరువాత రోజు ఉదయాన్ని ఆనీటిని మరిగించి టీలా తాగవచ్చు. నిత్యం ఉదయాన్ని 2టీ స్పూన్ల ఉసిరికాయ జ్యూస్ తాగినా లివర్ శుభ్రంగా ఉంటుంది.

ఉసిరిని తీసుకోవటం వల్ల లివర్ శుభ్రపడటంతోపాటు లివర్ పనితీరు బాగా మెరుగుపడుతుంది. రోజు ఉసిరి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఉపిరితిత్తుల్లో శాస్వనాళముల వాపు, ఆకలిలేకపోవుట, తదితర సమస్యలకు చక్కని పరిష్కారమార్గంగా చెప్పవచ్చు. ఉసిరిలోని లినోయిక్ ఆసిడ్ వల్ల కాలేయంలో చేరే మలిన, విషపదార్ధాలు తొలిగిపోయి కామెర్ల వంటి వాటిని తగ్గిస్తుంది.