Tulsi Leaves : మధుమేహ నియంత్రణలో తులసి ఆకుల పాత్ర కీలకమే !

రాత్రి నిద్రకు ముందుగా ఒక గ్లాసు నీటిలో గుప్పెడు తులసి ఆకులు నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల తులసిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కొని నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

Tulsi Leaves : మధుమేహ నియంత్రణలో తులసి ఆకుల పాత్ర కీలకమే !

Basil

Updated On : August 14, 2023 / 2:31 PM IST

Tulsi Leaves : ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న వ్యాధులు , మరణాలకు ప్రధాన కారణం జీవనశైలి కారణంగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులు. వీటిలో చాలా వరకు ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులు అనుసరించటం, ఆయుర్వేద వన మూలికలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చు. ఆయుర్వేదంలో ఉపయోగించే అన్ని మూలికలలో కెల్ల తులసి ప్రముఖమైనది. తులసి భౌతిక, రసాయన, జీవక్రియ , మానసిక ఒత్తిడిని సమస్యలను పరిష్కరించగలదని అనేక అధ్యయన ఆధారాలు ఉన్నాయి.

READ ALSO : Symptoms of Diabetes : వివిధ వయస్సుల వారిలో మధుమేహం లక్షణాలు ఏవిధంగా ఉంటాయంటే !

రిశ్రామిక కాలుష్య కారకాలు మరియు భారీ లోహాల నుండి రసాయన ఒత్తిడికి వ్యతిరేకంగా అవయవాలు , కణజాలాలను రక్షిస్తుంది. తులసి రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, లిపిడ్ స్థాయిలను సాధారణీకరించడం ద్వారా జీవక్రియ ఒత్తిడిని ఎదుర్కోగలదని , జ్ఞాపకశక్తి , అభిజ్ఞా పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించటంలో దాని యాంజియోలైటిక్ మరియు యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు బాగా తోడ్పడతాయి.

READ ALSO : Sugar Cause Diabetes : షుగర్ ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా? ఇందులోని వాస్తవమెంత ?

తులసికి ఆధ్యాత్మిక పరంగానే కాక, ఆయుర్వేదంలోనూ గొప్ప స్థానం కలిగి ఉంది. రోజువారీ ఆచారాలలో తులసిని ఉపయోగించడమే ఇందుకు నిదర్శనం. తులసిలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, ఐరన్, ఫైబర్‌, ఆల్సోలిక్‌ యాసిడ్, యూజినాల్ వంటి పోషకాలు , యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులను రోజూ నీళ్లలో వేసుకుని తాగితే షుగర్‌ నియంత్రణలో ఉంటుంది. అందుకే చక్కెర వ్యాధిగ్రస్తులకు తులసి దివ్యౌషధమని చెబుతారు. తులసి ఆకులలో హైపోగ్లైసీమిక్‌ స్థాయిని నియంత్రించే లక్షణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి.

READ ALSO : Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణం ఆ సమస్యే.. తాజా అధ్యయనంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

రాత్రి నిద్రకు ముందుగా ఒక గ్లాసు నీటిలో గుప్పెడు తులసి ఆకులు నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల తులసిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కొని నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి, నోటి దుర్వాసన తొలగిపోతుంది. తులసిలో ఉండే అయిల్ కంటెంట్ వాపు, ఇన్ఫ్లమేషన్‌ సంబంధిత లక్షణాలను తగ్గిస్తాయి.

READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

మానసిక సమస్యలు, ఒత్తిడితో బాధపడుతున్న వారికి తులసి చక్కని పరిష్కారం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. తులసిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ , యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీర కణాలను కాపాడతాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీనిలోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు మేలుచేయటంతోపాటు మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. తులసిని దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సంప్రదాయ వైద్యంలో పురాతన కాలం నుండి నేటికి ఉపయోగిస్తూ వస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం శ్రేయస్కరం.