Covishield Vaccine : కరోనా టీకాతో పెరిగిపోతున్న బ్లడ్ షుగర్ లెవల్స్.. వారిలోనే ఎక్కువట!
కరోనా టీకా వేసుకున్నవారిలో ఒక్కసారిగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదలకు దారితీయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో అధికంగా ఈ సమస్య ఉందని గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.

Covid 19 Vaccine Could Lead To Surge In Blood Sugar Levels
Covid-19 vaccine to surge blood sugar levels : కరోనా టీకా వేసుకున్నవారిలో ఒక్కసారిగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుదలకు దారితీయొచ్చునని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో అధికంగా ఈ సమస్య ఉందని గుర్తించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. కొవిడ్ టీకా తీసుకున్నాక తలెత్తిన సమస్యలతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి 7 నుంచి 8 కేసులు వచ్చినట్టు ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్, మెటబాలిక్ డిసీజెస్ అండ్ ఎండోక్రినాలజీ పేర్కొంది. గత 20ఏళ్లుగా టైప్ -2 డయాబెటిస్ కేసుల్లో 58 ఏళ్ల మహిళ ఒకరుగా తెలిపింది. డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్‌లో నివేదిక ప్రకారం.. మార్చి 4న ఆమె కోవిషీల్డ్ (Covishield) మొదటి మోతాదును వేయించుకుంది.
టీకాకు ముందు ఆమె రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ, టీకా తరువాత ఆమె రక్తంలో షుగర్ స్థాయిలు దాదాపు ఒక నెల వరకు పెరిగినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు డయాబెటిక్ మెట్‌ఫార్మిన్ (metformin) ఎక్కువ మోతాదు అవసరమని ఫోర్టిస్ సి-డాక్ చైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రా అన్నారు. అలాగే మరో 64 ఏళ్ల వ్యక్తికి జనవరి 18న కోవిషీల్డ్ మొదటి మోతాదును ఇచ్చారు. అతడిలో ఎలాంటి సమస్యలు లేవు. టీకా తర్వాత అతనిలో బ్లడ్ ప్రెజర్ 130/80mm HG నుంచి 160/90mmకి పెరిగిందని తెలిపింది.
కొన్ని గంటలు టాచీకార్డియా (tachycardia) చెమట, దడ వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిులు మూడు రోజులు పెరిగినట్టు గుర్తించారు. ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండానే సాధారణ స్థితికి మళ్లీ చేరుకున్నాయి. 65 ఏళ్ల వ్యక్తిలో కూడా టీకా అనంతరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినట్టు గుర్తించారు. 15 రోజుల్లో దానంతటే అదే సాధారణ స్థితికి చేరుకుంది.
కోవిషీల్డ్‌తో కలిగే సాధారణ దుష్ప్రభావాలలో.. ప్రధానంగా అలసట, చలి, తలనొప్పి, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. చాలా అరుదుగా కడుపు నొప్పి, దురద చర్మం లేదా దద్దుర్లు వంటివి కనిపిస్తాయి. అయితే రక్తపోటు పెరుగుదల లేదా డయాబెటిక్ లేని వ్యక్తులలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు టీకా ట్రయల్ డేటాలో వెల్లడించలేదని వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా టీకాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మాత్తుగా పెరగడానికి కారణమని తెలుస్తోందని తెలిపారు.