Omega 3 : చేపలతోపాటు ఒమేగా 3 లభించే అహారాలేంటో తెలుసా?
శాఖాహారులు చేపలను తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు ఓమేగా 3 అమ్లాలకోసం ఇతర శాకాహారాలను తీసుకోవచ్చు. అయితే వాటి గురించిన అవగాహన చాలా మందికి ఉండదు.

Omega
Omega 3 : మనం ఆరోగ్యంగా ఉంటే మన శరీరం, మెదడు చక్కగా పనిచేస్తాయి. అలాగే సంతోషంగా కూడా ఉంటాం. ఇలా ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం ఒమేగా త్రీ ఉన్న ఆహారం మీ ప్రతి రోజు భోజనం లో భాగం చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారపదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వంటి మహమ్మారితో పోరాడటానికి శరీరానికిన శక్తినిచ్చే వాటిలో ఈ ఆమ్లాలది మొదటి స్థానం.
ఒమేగా 3 ఆమ్లాలు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోమని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. రోజుకి మహిళలకు 1.1గ్రాము ఆమ్లాలు, పురుషులకు 1.6 గ్రాముల ఆమ్లాలు అవసరం పడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో మాత్రమే లభిస్తాయని చాలా మంది భావిస్తుంటారు. శాఖాహారులు చేపలను తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు ఓమేగా 3 అమ్లాలకోసం ఇతర శాకాహారాలను తీసుకోవచ్చు. అయితే వాటి గురించిన అవగాహన చాలా మందికి ఉండదు. అలాంటి వారు ఓమేగా 3 కోసం ఈ ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది.
కిడ్నీబీన్స్ : రాజ్మా లేదా కిడ్నీ బీన్స్… మొక్కల ఆధారిత ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను అందించే బీన్స్. రోజులో ఒక వ్యక్తికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లంలో 10 శాతం అవసరాన్ని ఇవి తీరుస్తాయి. అలాగే ఇనుము, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా అందుతుంది. గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.
కనోలా ఆయిల్ : ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభించే వంటనూనెల్లో కనోలా ముఖ్యమైనది. కేవలం ఒక టేబుల్ స్పూన్ నూనెలో 1.28 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఈ నూనెలో విటమిన్ ఇ, కె కూడా పుష్కలంగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు కూడా తక్కువగా ఉంటుంది.
చియా సీడ్స్ : గుప్పెడు చియా సీడ్స్ తింటే 5 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం కూడా కావాల్సినంత అందుతాయి.
అవిసె గింజలు : ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటూ ఫైబర్ అధికంగా ఉంటుంది. మొక్కల ఆధారిత పదార్థం కనుక వీగన్లు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక వ్యక్తికి రోజులో అవసరమైన దానికంటే రెండు మూడు రెట్లు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయివి. అంతేకాదు వీటిలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా తినేది
వాల్‌నట్స్ : మెదడు ఆకారంలో ఉండే గింజలు వాల్‌నట్స్. వాటిని చిరుతిండిగా రోజూ తినవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంవటాయి. నాలుగు వాల్‌నట్స్ తింటే 2.7 గ్రాముల ఆమ్లాలు శరీరంలో చేరతాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతోపాటూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తాయి.