పెళ్లికి రెడీ అవుతున్నారా.. ఇవి ఆలోచించడం మరిచిపోకండి

ఓ కొత్త రీసెర్చ్ పెళ్లి గురించి.. దానికి మనం ఎంత ఫిట్ అనే దాని గురించి విలువైన విషయాలు బయటపెట్టింది. ‘అమెరికాలో వివాహం, సంభోగం’ అనే అంశాలపై చేసిన ప్యూ సెంటర్ స్టడీలో 38శాతం మంది జంటలు డబ్బు అనేది ఒక్కటే పార్టనర్ తో కలిసి జర్నీ చేయడానికి కారణం అంటున్నారు. 29శాతం మంది మాత్రం డబ్బులు లేకపోవడం కారణంగానే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీనిని బట్టి పెళ్లిళ్లకు లేదా ఎక్కువ కాలం కలిసి ఉండటానికి డబ్బు ఒక్కటే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. నెలకోసారి ఐదుగురిలో ఒకరికి ఆర్థిక సమస్యలు వస్తున్నాయని సర్వేలో తెలిసింది.
‘ఎవరినైతే మీరు భాగస్వామిగా సీరియస్ గా ఎంచుకోవాలనుకుంటారో.. వారితో మీకు కాబోయే పిల్లల గురించి, మీ ఖర్చుల గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఒక్కరు కూడా రిటైర్మెంట్ గోల్స్, ఆధాయంలో ఎంత పొదుపు చేస్తారని మాత్రం మాట్లాడరు’ అని ఫైనాన్షియల్ సైకాలజి ఇన్‌స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రాడ్ క్లోంజ్ అంటున్నారు.
‘కొందరైతే ఇంకా తెలివి చూపించి.. బ్లడ్ టెస్టులు చేయించుకుని సుఖ వ్యాధులేమైనా ఉన్నాయా అని పరీక్షించుకుంటారు. కానీ, క్రెడిట్ స్కోర్ ను చెక్ చేయరు. అసలైతే ఇది పెద్ద టాపిక్ ఏం కాదు. ఎవరూ దీని గురించి మాట్లాడరు కూడా. అప్పుడే డిఫరెంట్ యాంగిల్ లో ఉన్నామని తెలుస్తుంది’ అని చెప్తున్నారు.
డబ్బే మనిషులపై ఎమోషనల్ గా ప్రభావం చూపిస్తుందా అంటే అవుననే అంటున్నారు ఫైనాన్షియల్ థెరపిస్ట్. ఆర్థిక వనరులు ఖాళీ అయిపోతున్నాయి. లేదంటే సంపాదన తక్కువ అవుతుందంటే సమస్యలు మొదలైపోతాయి. అందుకే కొంతమంది ఇళ్లలో ఫైనాన్షియల్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఉన్నదీ లేనిదీ తెలియకుండా మేనేజ్ చేసుకుని గౌరవం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
దీనికి మీరు చేయాల్సిందల్లా పెళ్లికి ముందుగానే కొన్ని విషయాలపై క్లారిటీకి రావాలి. ఆర్థికంగా కచ్చితంగా ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే జర్నీ మొదలుపెట్టాలి.
1. డబ్బులు లేదా ఆర్థిక అంశాల గురించి ఓపెన్ గా చర్చించుకోవాలి.
దాని కంటే ముందే మీలో మీరే ప్రశ్నించుకోండి. మీ పేరెంట్స్ డబ్బుల గురించి మీకేం నేర్పించారు. డబ్బు అంటే మీకు ఎందులో భయం. సామాజిక ఎదుగుదలను మీరు ఎలా ఫీల్ అవుతారనేవి కచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయాలు.
2. ఓపెన్‌గా మాట్లాడుకోవడమే కాకుండా.. పెట్టిన ఖర్చుకు జవాబుదారీగా ఉండండి.
ఎలా ఖర్చు పెడితే మనకు కరెక్ట్ సెట్ అవుతుందో తెలుసుకోవాలి. మెయింటైన్ చేసే సీక్రెట్ క్రెడిట్ కార్డ్ గురించి ఆలోచించాలి.
3. ప్రశాంతంగా ఉండండి.
ప్రతి రోజు డబ్బుల గురించి ఆలోచిస్తూ.. టెన్షన్లు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడమే బెటర్.
4. కొన్ని విషయాలపై ప్రధాన ఒప్పందాలు ఉండటమే మంచిది.
5. మీ లక్ష్యాలను ఎంచుకుని దానికి తగ్గ ప్రణాళికలు ఏర్పరచుకోండి.
6. ఖర్చులను సమానంగా పంచుకోండి.
7. కాంప్రమైజ్ అవడానికి సిద్ధంగా ఉండండి.