Angel Fruit Health Benefits : ఏంజెల్ ఫ్రూట్ గురించి తెలుసా ? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు !
మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యం కోసం బొప్పాయిని తీసుకోవటం మంచిది.

PAPAYA
Angel Fruit Health Benefits : బొప్పాయి..దీనినే ఏంజెల్ ఫ్రూట్ గా పిలుస్తారు. ఆరోగ్యానికి మేలు కలిగించటంతోపాటు, చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతగానో దోహదపడుతుంది. అధ్యయనాల ప్రకారం, బొప్పాయిలో అనేక రకాల పోషకాలు ఉన్నట్లు తేలింది. అనేక తీవ్రమైన వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. డైటీషియన్లు చెప్తున్న దాని ప్రకారం బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఇవి అనేక రకాల తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
READ ALSO : Papaya Fruit : బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందంటారు .. నిజమేనా?
ఈ ఏంజెల్ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి9, పొటాషియం , మెగ్నీషియలకు అద్భుతమైన మూలం. వాటితో కాల్షియం, విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థ, చర్మపు ఛాయను మెరుగుపరచడంతోపాటుగా, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో తోడ్పడుతుంది.
బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. మధుమేహుల కోసం బొప్పాయి ;
డయాబెటిక్ రోగులు ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిక్ రోగులకు బొప్పాయి తినటం చాలా మంచిది. అధ్యయనాల ప్రకారం, టైప్-1 మధుమేహ రోగులు అధిక ఫైబర్ ఆహారం తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో పీచు ఉంటుంది.
READ ALSO : Papaya : జీర్ణక్రియను మెరుగుపరచటంలో అద్భుతంగా ఉపయోగపడే పచ్చిబొప్పాయి?
2. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది ;
బొప్పాయిలో లైకోపీన్ సమ్మేళనం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు బొప్పాయి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ ఉండటం వల్ల దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల యువకులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. బలమైన ఎముకలు ;
బొప్పాయి తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. బొప్పాయి శరీరంలో విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. విటమిన్ సి లోపం వల్ల ఎముక పగుళ్ల ప్రమాదం పెరుగుతుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ కె మరియు కాల్షియం కూడా ఉన్నాయి.
READ ALSO : Papaya : బరువు సులభంగా తగ్గాలనుకునే వారికి…. బొప్పాయి బెటర్
4. వయస్సు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం ;
మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యం కోసం బొప్పాయిని తీసుకోవటం మంచిది.
5. జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి ;
జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
READ ALSO : Diet For Dengue : డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు
6. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ;
జుట్టు, కుదుళ్ళు , ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయిని తీసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ అనేది సెబమ్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలలో ఒకటి. సెబమ్ జుట్టు కు తేమను అందించేందుకు సహాయపడుతుంది.
7. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ;
బొప్పాయి చర్మానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయకారిగా పనిచేస్తుంది. ముడతలు వంటి సమస్యలను నివారించడంలో ఈ పండు సహాయపడుతుంది.