Flying Kites on Makar Sankranti : సంక్రాంతి నాడు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

సంక్రాంతి పండుగ నాడు పిల్లలు, పెద్దలు రంగు రంగుల గాలి పటాలు ఎగరేస్తారు. ఇలా ఎగరేయడం వెనుక కారణాలేంటో తెలుసా?

Flying Kites on Makar Sankranti : సంక్రాంతి నాడు గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

Flying Kites on Makar Sankranti

Updated On : January 12, 2024 / 7:51 PM IST

Flying Kites on Makar Sankranti : మకర సంక్రాంతి భారతదేశం అంతటా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా గాలి పటాలు ఎగరేస్తారు. ఇలా ఎగరేయడం వెనుక శాస్త్రీయ కారణాలతో పాటు అనేక అంశాలు ఉన్నాయి.

గాలిపటాలు ఎగరేయడం అనేది సూర్య భగవానుడి పట్ల భక్తిని వ్యక్తపరిచే మార్గం. అలాగే భూమికి ఆకాశాన్ని అనుసంధానం చేస్తూ గాలి పటాలు ఎగరేయడం వల్ల మరణించిన వారి ఆత్మలు స్వర్గానికి చేరుతాయని కూడా కొందరు నమ్ముతారట.

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

మకర సంక్రాంతి నాడు గాలి పటాలు ఎగరేయడం వెనుక శాస్త్రీయ కారణాలను కూడా చెబుతారు. శీతాకాలంలో వచ్చే ఈ పండుగ సమయంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతుంటారు. గాలి పటాలు ఎగరేయడం వల్ల సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి. సూర్యరశ్మి నుండి డి విటమిన్ అందటంతో రోగ నిరోధక శక్తి పెరుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది.

గాలిపటాలు ఎగరేయడం వెనుక చారిత్రక కారణాలు కూడా చెబుతారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో గాలి పటాలు కాలక్షేపం కోసం ఎగరేసేవారట. ఇది క్రమంగా భారతదేశ సంస్కృతిలోకి విస్తరించింది. మకర సంక్రాంతి పండుగ వేళ రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురేయడం అంతర్భాగంగా మారింది. గాలి పటాలు ఎగరేయడం మారుతున్న రుతువులకు ప్రతీక.

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

ఇండియాలో సంక్రాంతి వేడుకల సమయంలో గాలి పటాలు ఎగరేసే పోటీలు నిర్వహిస్తారు. ఎంతోమంది ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ పోటీలో పాల్గొనేవారు తమ గాలిపటంతో తమ ప్రత్యర్ధి గాలిపటం దారాన్ని కట్ చేయాలి. ఈ పోటీలు గుజరాత్‌లో వైభవంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే కైట్ ఫెస్టివల్ ఎంతోమందిని ఆకర్షిస్తుంది. పంజాబ్‌లో ఈ పండుగను ‘లోహ్రీ’ పేరుతో జరుపుకుంటారు. గాలిపటాలు ఎగరేసే పోటీలో పాల్గొని తమ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు.