Makar Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం. అందుకే పండుగరోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా పెద్దలు నిర్ణయించారు.

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

Makar Sankranti 2024

Updated On : January 11, 2024 / 9:30 AM IST

Sankranti : మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి సమయం కేవలం పండుగలా మాత్రమే చూడము.. సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతీయేటా జనవరి 14వ తేదీన జరుగుతుంది. కానీ, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15న పండగను జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆరచిస్తారు. ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

Also Read : Makar Sankranti 2024: భోగి పండ్ల ప్రాముఖ్యత

బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం. అందుకే పండుగరోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా పెద్దలు నిర్ణయించారు. ఈ శుభ ఘడియల్లో చేసే పూజలు, దానాలతో పుణ్యం కలుగుతుంది. వరాహ మూర్తి భూమిని ఉద్ధరించిన సంకేతంగా – సంక్రాంతి రోజున గుమ్మడికాయ (కూష్మాండం) దానం చేస్తారు. దీంతోపాటు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, చెరకు, గోవు, బంగారం.. ఇలా శక్తికొద్దీ దానం చేస్తారు. ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి.

Also Read : Makar Sankranti 2024: సంక్రాంతి స్పెషల్ వంటకాలు

సంక్రాంతి రోజు నువ్వులతో హోమం, నువ్వుల దానంతో శని దోషం నివృత్తి అవుతుందని చెబుతారు. తెల్లని నువ్వులు సేవించడం వల్ల అకాల మృత్యు బాధ తొలగి, ఆయుష్షు పెరుగుతుందన్నది పురాణ వచనం. కొత్త బియ్యంతో పరమాన్నం, అరిసెలు వంటి పిండివంటలు చేసి శ్రీమహావిష్ణువుకి నైవేద్యం సమర్పించడం ఆచారం. పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తుంటారు. అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ కనుక సంక్రాంతిని పెద్ద పండుగ, పెద్దల పండుగ అనికూడా పిలుస్తారు.