Milk : పాలతో కలిపి ఆ ఆహారాలను తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!…
చేపలు ఆహారంగా తీసుకున్నాక పాలను సేవించ వద్దు అలా చేయటం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి బాధిస్తుంది. అంతే కాకుండా శరీరంలో వేడి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కలిస్తే శరీరంలో వి

Milk
Milk : ప్రతి మనిషి యొక్క శారీరక ఆరోగ్యం వారి వారి ఆహారపు అలవాట్లను బట్టే అధారపడి ఉంటుంది. ఏ రకమైన ఆహారం తీసుకున్నా, మనం తినే అనేక ఆహారాలు ఆరోగ్యకరమా కాదా అన్న విషయం తప్పనిసరిగా తెలుసుకోవటం ముఖ్యం. ముఖ్యంగా ఆరోగ్యం కోసం మనం తీసుకునే వాటిల్లో పాలు ముఖ్యమైనది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గాను, ఆకలి లేని సమయంలో పాలతో కడుపు నింపేస్తుంటారు. అయితే పాలు తాగే అలవాటు ఉన్నవారు కొన్ని ముఖ్యమైన సూచనలను మాత్రం ఖచ్చితంగా పాటించాలని పలువురు చెబుతున్నారు.
పాలు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. పాలలో కాల్షియం, విటమిన్ ఎ, బి12, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే పాలు తాగటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కాని, పాలు తాగటానికి ముందు, పాలు తగిన తరువాత మనం తీసుకునే ఇతర ఆహారాల విషయంలోనే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకుంటే ఆరోగ్యపరమైన చిక్కుల్లోకి వెళ్ళాల్సిన పరిస్ధితి తలెత్తుతుంది…..
ముందుగా చెప్పబోయేదేంటంటే పాలు తాగక ముందుకాని తాగిన తరువాతకాని పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోకపోవటం మంచిది. ఈరెండింటిని కలిపి తీసుకోవటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పాలతో పాటు పెసరపప్పు, మినప్పప్పు వంటి వాటిని తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నమౌతాయి. పప్పులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాలు తాగిన 2గంటల తరువాత మాత్రమే వీటిని తీసుకోవాలి.
చేపలు ఆహారంగా తీసుకున్నాక పాలను సేవించ వద్దు. అలా చేయటం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి బాధిస్తుంది. అంతే కాకుండా శరీరంలో వేడి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కలిస్తే శరీరంలో విషంగా మారే అవకాశాలు ఉంటాయి. పాల ఉత్పత్తులను నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయలు, లీచీ వంటి సిట్రస్ పండ్లతో కలిపి తీసుకోవద్దు. దీని వల్ల శరీరంలో విషపూరితమై, చర్మ అలర్జీలు, జలబు, దగ్గు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.
పాలకూర పనసపండ్లు చాలా మందికి బాగా ఇష్టమైనవి. అయితే వీటిని తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోరాదు. అదే సమయంలో నువ్వులు ఉప్పు కలగలిపి ఉండే ఆహారం తీసుకున్న 2గంటల వరకు పాలు కాని, పెరుగుకాని తీసుకోరాదు. ఇలా చేస్తే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.
ముల్లంగి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల కిడ్నీరాళ్లు, చుండ్రు, దురద, తామర, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే క్యారెట్లు, చిలకడ దుంపలు, బంగాళదుంపలు, నూనె, బెల్లం, తేనే, పెరుగు, కొబ్బరి, వెల్లుల్లి వంటి పదార్ధాలు తీసుకున్న వెంటనే కాని, తరువాతకాని పాలను తాగటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు.