Seasonal Affective Disorder : వర్షాకాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఎదుర్కోవటానికి ప్రభావవంతమైన మార్గాలు !

వ్యాయామం శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సమయం చేయాల్సిన పనిలేదు.

Seasonal Affective Disorder : వర్షాకాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఎదుర్కోవటానికి ప్రభావవంతమైన మార్గాలు !

seasonal affective disorder

Seasonal Affective Disorder : వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరంలో అనేక మార్పలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో దిగులుగా ,సాధారణం కంటే ఎక్కువ నీరసంగా, మూడీగా , ఆత్రుతగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా మంది ఇలాంటి సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ని ఎదుర్కొనే ఉంటారు. వర్షకాలంలో, చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఈ తరహా రుగ్మత సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో ఇది వేసవి కాలంలో కూడా సంభవించవిస్తుంది.

READ ALSO : Kashmir Saffron : ఇంట్లోనే కశ్మీర్ కుంకుమపువ్వు సాగు

తేమతో కూడిన వర్షాకాలంలో దిగులుగా, విచారంగా, మూడిగా ఉండటం వంటి లక్షణాలు కలిగి ఉంటే దానిని నుండి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఎంతగానో దోహదం చేస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సూర్యరశ్మిని పుష్కలంగా పొందేలా చూడటం: దిగులును పొగొట్టుకునేందుకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో ఒకటి ప్రకాశవంతమైన కాంతి శరీరంపై పడటం. ఎండ ఉన్నప్పుడు పగటి వేళల్లో కొంత సమయం ఆరుబయట తిరగాలి. సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం మీ మానసిక స్థితిని మెరుగుపర్చటంలో సహాయపడుతుంది.

READ ALSO : Monsoon Diseases : డెంగ్యూ నుండి చికున్‌గున్యా వరకు వర్షకాలంలో వచ్చే 5 సాధారణ వ్యాధులు, నివారణ చిట్కాలు !

వ్యాయామం: వ్యాయామం శక్తి స్థాయిలను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి , మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సమయం చేయాల్సిన పనిలేదు. కేవలం కొన్ని నిమిషాలు నడవడం, చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయటం వల్ల తేడాను గమనించవచ్చు.

READ ALSO : Fever Season : జ్వరాల కాలం వర్షకాలం! జాగ్రత్తలే రక్షణ

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం: ఆరోగ్యకరమైన ఆహారం ఒత్తిడి స్థాయిలను నిర్వహించడంలో, శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. తాజా పండ్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా మెరుగైన అనుభూతిని పొందవచ్చు.

READ ALSO : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు ఇవే!

ఇతరులతో కనెక్ట్ అవ్వటం: ఒంటరితనం ,దిగులు వంటి లక్షణాలను పొగొట్టుకునేందుకు మంచి అనుభూతిని కలిగించే వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ముఖ్యం. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం లేదా సోషల్ మీడియాలో వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం వంటివి మొత్తం మానసిక స్థితి , జీవితంపై మంచి దృక్పథాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

READ ALSO : Shade Net :షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో నారు పెంపకం

రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయటం: విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. భావోద్వేగాలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస , జర్నలింగ్ వంటి కార్యకలాపాలను ప్రయత్నించటం మంచిది.