ఫేస్ మాస్క్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..కావాలంటే..రూ. 70 వేలు పెట్టాల్సిందే.

FANCY FACE SHIELD : కరోనా కారణంగా ఫేస్ మాస్క్, మాస్క్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే..బయటకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. నిత్య జీవితంలో ఒక భాగమై పోయాయి. ప్రజలను ఆకర్షించే విధంగా మాస్క్, ఫేస్ మాస్క్ లను తయారు చేస్తున్నాయి పలు కంపెనీలు. సౌకర్యవంతంగా ఉండే తయారు చేసి మార్కెట్ లకు వదులుతున్నారు.
Louis Vuitton కూడా 2021 Cruise Collection లో భాగంగా..అందమైన ఫేస్ మాస్క్ ను తయారు చేసింది. ‘LV’ trimతో ప్లాస్టిక్ తో తయారు చేశారు. అంచులను అందంగా తీర్చిదిద్దారు. తల నదుటిపై రిబ్బన్ మాదిరిగా కట్టుకొనే విధంగా తయారు చేశారు. అంచులు, రిబ్బన్ గా ఉన్న బట్టపై సేమ్ డిజైన్ చేశారు.
వచ్చే నెలలో మార్కెట్ లో రిలీజ్ చేయనున్నారు. అసలు ధర ఎంత అనుకుంటున్నారా ? $ 961 (తక్కువ, ఎక్కువ) రూ. 70 వేలు అంట. ఇది ధరిస్తే ఎలాంటి వేడి ఉండకుండా..చల్లగా ఉండే విధంగా తీర్చిదిద్దామని వెల్లడించారు. స్టైలిష్ గా ఉండడమే కాకుండా…వైరస్ నుంచి రక్షణ ఉంటుందన్నారు.